MLA Raja Singh : కాషాయం నా బ్ల‌డ్ లో ఉంది – రాజా సింగ్

నేను బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవ‌డం లేదు

MLA Raja Singh : తాను భార‌తీయ జ‌న‌తా పార్టీని వీడుతున్నాన‌ని, త్వ‌ర‌లోనే భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్ ) లో చేరుతున్న‌ట్లు వ‌స్తున్న ప్ర‌చారాన్ని తీవ్రంగా ఖండించారు బీజేపీ మ‌ల‌క్ పేట ఎమ్మెల్యే రాజా సింగ్. కావాల‌ని త‌న ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. త‌న ర‌క్తంలో అడుగడుగునా కాషాయం నిండి పోయింద‌ని అన్నారు. మీరు క‌త్తి తీసుకుని నా శ‌రీరాన్ని కోస్తే ర‌క్తానికి బ‌దులు కాషాయ జెండా ఉంటుంద‌న్నారు రాజా సింగ్.

త‌న మీద కావాల‌ని స‌స్పెన్ష‌న్ వేటు వేశార‌ని, ఎత్తి వేయ‌కుండా రాజ‌కీయ స‌న్యాసం చేస్తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. బీఆర్ఎస్ లో చేరుతాన‌న్న ప్ర‌చారం ఒట్టిదేన‌ని స్ప‌ష్టం చేశారు. రాజా సింగ్(Raja Singh) మ‌ర్యాద పూర్వ‌కంగా ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావును క‌లిశారు. ఆయ‌న ఇలా క‌లుసుకున్నారో లేదో అక్క‌డ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ లోకి జంప్ అవుతాడంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది.

దీంతో అవాక్కయ్యారు ఎమ్మెల్యే రాజా సింగ్. దీనిని పూర్తిగా ఖండిస్తున్న‌ట్లు చెప్పారు. తాను బీఆర్ఎస్ లో చేరేందుకు హ‌రీశ్ ను క‌ల‌వ‌లేద‌ని అన్నారు . ధూల్ పేట ఆస్ప‌త్రి ఆధునీక‌ర‌ణ ప‌నుల విష‌యానికి సంబంధించి అడిగేందుకు మాత్ర‌మే తాను త‌న్నీరును క‌లిశాన‌ని పేర్కొన్నారు. తాను బీజేపీని వీడే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Pawan Kalyan : ల‌క్ష కోట్లు దోచుకున్న జ‌గ‌న్ – ప‌వ‌న్

Leave A Reply

Your Email Id will not be published!