MLA Rajagopal Reddy: మరోసారి సీఎం రేవంత్‌ను టార్గెట్ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

మరోసారి సీఎం రేవంత్‌ను టార్గెట్ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

MLA Rajagopal Reddy : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ… సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా… రేవంత్ రెడ్డిపై విరుచకపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనకు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌న్న హామీని అమ‌లు చేయ‌కుండా రాష్ట్ర ముఖ్య‌ నేత‌లు అడ్డుకున్నారని మండిపడ్డారు.

తనకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) ‘ఎక్స్’ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి పదవిపై హైకమాండ్‌ మాట ఇచ్చిన విషయం సహా… కొందరు అడ్డుకుంటున్నారనే వాస్తవాలను భట్టి బయటపెట్టారని చెప్పారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదన్నారు. ప్రజలుకు ఇచ్చిన హామీల‌ను కాంగ్రెస్ స‌ర్కారు అమ‌లు చేయాల‌ని, అవినీతి ర‌హిత‌ పాల‌న అందించాల‌ని కోరుతున్నానని పేర్కొన్నారు. తెలంగాణ స‌మాజ ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేలా కాంగ్రెస్ ప్ర‌భుత్వ పాల‌న ఉండాల‌ని ఆశిస్తున్నానట్లు స్పష్టం చేశారు.

MLA Rajagopal Reddy – సీఎం రేవంత్‌రెడ్డితో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ భేటీ అయ్యారు. గంటన్నరకుపైగా సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్త్రృతంగా తీసుకెళ్లడంపై నేతలిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో పీసీసీ, పీఏసీ భేటీ ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మెజారిటీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నేతలు నిర్ణయించారు. ముఖ్యంగా 42శాతం బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నారు. బోర్డు, కార్పొరేషన్‌ డైరెక్టర్ల పోస్టుల నియామకాలు త్వరగా చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. జనహిత పాదయాత్రలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కారాలపై నేతలు చర్చించినట్లు సమాచారం.

Also Read : Mega DSC: మెగా DSC ఫలితాలు విడుదల

Leave A Reply

Your Email Id will not be published!