MLA Ram Kadam Pathan : పఠాన్ మూవీపై రామ్ కదమ్ ఫైర్
మరాఠాలో విడుదలకు ఒప్పుకోం
MLA Ram Kadam Pathan : దీపికా పదుకొణే, సారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూత్వ సంస్థలు మండి పడుతున్నాయి. ఇప్పటికే మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ మంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తమ రాష్ట్రంలో ఎక్కడా ప్రదర్శించేందుకు వీలు లేదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా వచ్చే నెలలో 2023 జనవరిలో పఠాన్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా సినిమాకు సంబంధించి దీపికా పదుకొణే , షారుఖ్ ఖాన్ నటించిన పాటలో కొన్ని అభ్యంతకర సన్నివేశాలతో పాటు హిందువులను కించ పరిచేలా ఉన్నాయంటూ హిందూత్వ సంస్థలు మండిపడ్డారు.
ఆపై నిప్పులు చెరుగుతున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్రలో ఎట్టి పరిస్థితుల్లో పఠాన్ చిత్రాన్ని ఆడేందుకు ఒప్పుకోమని హెచ్చరించారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రామ్ కదమ్(MLA Ram Kadam Pathan). బేషరమ్ రంగ్ పాటలో ప్రధాన జంట ధరించే దుస్తులలో మత పరమైన కోణం ఉందంటూ ఆరోపించారు.
దీనిని తాము ఎట్టి పరిస్థితుల్లో విడుదలకు అనుమతించ బోమంటూ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే. కాగా బేషరమ్ రంగ్ పాటలో దీపికా పదుకొణే అసభ్యకరమైన బికినీ ధరించింది. ఇందులో పవిత్రమైన కుంకుమ పువ్వుని ఉపయోగించడాన్ని తప్పు పట్టారు రామ్ కదమ్.
ఇదిలా ఉండగా జేఎన్ యూ కు సంబంధించిన కొంత మంది విద్యార్థులు దీపికా పదుకొణేకు మద్దతు ఇవ్వడాన్ని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో ఎవరికైనా ఎలాంటి దుస్తులనైనా ధరించే హక్కు ఉందంటున్నారు. కానీ దానిని తీవ్రంగా తప్పు పడుతున్నారు రామ్ కదమ్. హిందూత్వాన్ని అవమానించే ఏ సినిమాను తాము ఒప్పుకోమన్నారు రామ్ కదమ్.
Also Read : పెద్ద దర్గాలో తలైవా..రెహమాన్