MLA Rathod Bapu Rao : బీఆర్ఎస్ ను వీడను ఏ పార్టీలో చేరను
పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే
MLA Rathod Bapu Rao : బోథ్ నియోజ్కవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ వీడుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ఇతర పార్టీల వైపు చూస్తున్నట్లు సామాజిక మాధ్యమాలలో వార్తలు రావడాన్ని తప్పు పట్టారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
MLA Rathod Bapu Rao Responded
మంగళవారం బోథ్ ఎమ్మెల్యే బాపూ రావు(MLA Rathod Bapu Rao) మీడియాతో మాట్లాడారు. తాను కేసీఆర్ ను నమ్ముకుని ఉన్నానని, పార్టీ కోసం పని చేస్తానే తప్పా పదవుల కోసం ఇతర పార్టీల వైపు చూడాల్సిన అవసరం తనకు లేదన్నారు.
కొందరు కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాపూ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తాను ముందు నుంచీ పార్టీని నమ్ముకుని పని చేస్తూ వచ్చానని స్పష్టం చేశారు ఎమ్మెల్యే.
ఇదిలా ఉండగా బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ సీఎం కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 119 సీట్లకు గాను 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఛాన్స్ దక్కలేదు.
వీరిలో ఇప్పటికే ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ తను పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆమెతో పాటు బోథ్ ఎమ్మెల్యే కూడా జంప్ అవుతారంటూ ప్రచారం జరిగింది. ఇవాళ్ల తాను మారడం లేదంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Also Read : Mynampally Hanumanta Rao : హరీశ్ ను అన్నా పార్టీని కాదు