MLC Kavitha CM KCR : సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్సీ క‌విత భేటీ

సీబీఐ నోటీసులు ఇచ్చిన నేప‌థ్యం

MLC Kavitha CM KCR : దేశ వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో ప్ర‌ధానంగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యురాలు ఎమ్మెల్సీ క‌విత‌కు(MLC Kavitha) షాక్ త‌గిలింది. 160 పీఆర్సీ కింద కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేశారు. ఈ మేర‌కు డిసెంబ‌ర్ 6న విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా కోరింది.

ఈ మేర‌కు జారీ చేసిన నోటీసులో హైద‌రాబాద్ లో కానీ లేదా ఢిల్లీ లో హాజ‌రు కావాల‌ని స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే ఢిల్లీ మ‌ద్యం పాల‌సీ కేసుకు సంబంధించి ఇప్ప‌టికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాతో పాటు మ‌రో 14 మందిపై అభియోగాలు మోపింది.

ఇప్ప‌టికే క‌విత అనుచ‌రుడిగా పేరొందిన బోయిన‌ప‌ల్లి అభిషేక్ రావు, అర‌బిందో ఫార్మా డైరెక్ట‌ర్ శ‌ర‌త్ చంద్రా రెడ్డి, విజ‌య్ నాయ‌ర్ , అమిత్ అరోరా ను అరెస్ట్ చేసింది. అంతేకాకుండా రామ‌చంద్ర పిళ్లై , ఆడిట‌ర్ బుచ్చిబాబుతో శ్రీ‌నివాస‌రావు ను అదుపులోకి తీసుకుంది. అభిషేక్ బోయున్ ప‌ల్లి, శ‌ర‌త్ చంద్రా రెడ్డి తీహార్ జైలులో ఉన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 173 ఫోన్ల‌ను ధ్వంసం చేశార‌ని, దీని విలువ రూ. 1.37 కోట్లుగా ఉంటుంద‌ని ఈడీ వెళ్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా బంజారా హిల్స్ లోని త‌న నివాసంలో క‌విత‌ను ఈ సందర్భంగా విచార‌ణ చేప‌ట్ట‌నున్నారు.

దీంతో ఆమెను అరెస్ట్ చేస్తార‌న్న ప్ర‌చారం జోరుగా వినిపిస్తున్న త‌రుణంలో ఎమ్మెల్సీ క‌విత(MLC Kavitha CM KCR) హుటా హుటిన త‌న తండ్రి, సీఎం కేసీఆర్ వ‌ద్ద‌కు బ‌య‌లు దేరారు. ఆమె ఇంటి వ‌ద్ద‌కు భారీ ఎత్తున కార్య‌క‌ర్త‌లు, నేత‌లు హాజ‌ర‌య్యారు.

Also Read : ఆవిష్క‌ర‌ణ‌లు..అంకురాల‌కు పెద్ద పీట

Leave A Reply

Your Email Id will not be published!