MLC Kavitha Attend : ఈడీ విచారణకు హాజరైన కవిత
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు
MLC Kavitha Attend ED : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు(MLC Kavitha Attend ED). ఇదే కేసుకు సంబంధించి మార్చి 11న ఉదయం 11 గంటలకు వెళ్లిన కవిత రాత్రి 8.05 గంటలకు బయటకు వచ్చారు. ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఇదే సమయంలో మార్చి 16న హాజరు కావాలని నోటీసు ఇచ్చింది. ఈడీ ఒప్పు కోలేదు మార్చి 20న రావాల్సిందేనంటూ నోటీసు జారీ చేసింది.
తనను టార్చర్ చేస్తోందని, థర్డ్ డిగ్రీ ప్రయోగించిందంటూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొంది. తనను విచారణ జరపకుండా ఈడీని ఆదేశించాలని కోరింది. దీనిపై తీవ్ర ఆరోపణలు చేసిన కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఈ తరుణంలో సీనియర్ న్యాయవాదులు, నిపుణులతో చర్చోప చర్చలు జరిపారు. కవిత చేసిన ఆరోపణలను తోసి పుచ్చుతూ కోలుకోలేని షాక్ ఇచ్చింది ఈడీ. కవితకు వెసులుబాటు ఇవ్వ వద్దంటూ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేసింది. ఈ తరుణంలో ఇవాళ హాజరు అయ్యేందుకు తన సోదరుడు మంత్రి కేటీఆర్ , భర్త అనిల్ తో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు.
వీరితో పాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఉదయం 10.30 గంటలకు ఈడీ ఆఫీసు లోపలికి వెళ్లారు. చాలా కూల్ గా ఉండడం కూడా విస్తు పోయేలా చేసింది.
Also Read : ఎవరీ ‘గోరంట్ల’ ఏమిటా కథ