MLC Kavitha : కవిత ప్రచార రథం రెడీ
వచ్చే ఎన్నికలపై ఫోకస్
MLC Kavitha : తెలంగాణ – లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం త్వరలో రాష్ట్రంలో జరగబోయే శాసన సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆమె జాగృతి సంస్థకు చీఫ్ గా ఉన్నారు. బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా పేరు పొందారు. ఇదే సమయంలో కవిత(MLC Kavitha) నిజామాబాద్ ఎంపీగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొంత కాలం సైలెంట్ గా ఉండి పోయారు. ఆ వెంటనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తండ్రి సీటు ఇవ్వడంతో గెలుపొందారు.
MLC Kavitha Campaign Updates
అనంతరం ఊహించని రీతిలో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పాత్ర ఉందంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఆ తర్వాత మూడు సార్లు ఢిల్లీలో విచారణకు హాజరైంది. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిందంటూ దీనిపై కోర్టు ఆమెకు రిలీఫ్ ఇచ్చింది.
ఇదే సమయంలో ప్రస్తుతం ఎన్నికలు రావడంతో తండ్రికి, సోదరుడు కేటీఆర్ కు తోడుగా తనదైన పాత్ర పోషించేందుకు రెడీ అయ్యింది. నిజామాబాద్ జిల్లాపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఎన్నికల్లో ప్రచారం చేపట్టేందుకు రథాన్ని తయారు చేయించింది. ఓ వైపు తండ్రి ఇంకో వైపు కూతురు క్యాంపెయిన్ లో కీలకంగా మారనున్నారు.
Also Read : Akunuri Murali : అబద్దాల నటరత్న కేటీఆర్