MLC Kavitha Case : కవిత కస్టడీని మల్లి జులై 7 వరకు పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్ట్
ఆ తర్వాత ఆమెను న్యూఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండ్‌కు తరలించారు...
MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె. కవిత కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. వీరి రిమాండ్‌ను జూలై 7 వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.మద్యం కుంభకోణం కేసులో కవిత రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచారు.
MLC Kavitha Case
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైదరాబాద్‌కు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ మార్చి 15న అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆమెను న్యూఢిల్లీలోని తీహార్ జైలులో రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత ఇదే కేసులో సీబీఐ కూడా ఆమెను ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆమె నుంచి సీబీఐకి కీలక సమాచారం అందింది. మరోవైపు ఇదే కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
Also Read : Coal Mine Auction : కమర్షియల్ కోల్ మైన్ వేలం 10వ విడత మొదలు పెట్టిన సర్కారు