ED MLC Kavitha : మద్యం కుంభకోణంలో కవిత కీలకం – ఈడీ
కుండ బద్దలు కొట్టిన దర్యాప్తు సంస్థ
ED MLC Kavitha : కేంద్ర దర్యాప్తు సంస్థ కోలుకోలేని షాక్ ఇచ్చింది. నిన్నటి దాకా తనకేం తెలియదని, తాను ఏ తప్పు చేయలేదని చిలుక పలుకులు పలికిన ఎమ్మెల్సీ కవిత మాటలు తప్పని తేల్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED MLC Kavitha). మద్యం దందాలో తాను వెనుక నుండి తతంగం నడిపించారని పేర్కొంది.
ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రు విచారణ సందర్భంగా కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెల్లడించింది. సీబీఐ కేవలం విచారణ చేపడితే ఈడీ ఏకంగా అరెస్ట్ కు రంగం సిద్దమవుతోంది. ఈ సమయంలో సీఎం కేసీఆర్ ఏ రకంగా వ్యవహరిస్తారనేది తేలాల్సి ఉంది. సౌత్ గ్రూప్ ద్వారా మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కాంను నడిపించారని స్పష్టం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ.
వైఎస్సార్ సీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి స్వయాన అల్లుడి సోదరుడు , అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సౌత్ గ్రూప్ గా ఏర్పడి లిక్కర్ దందాలో కీలక పాత్ర పోషించారంటూ 268 పేజీల చార్జ్ షీట్ లో తెలిపింది. దిమ్మ తిరిగే వాస్తవాలను బయట పెట్టింది.
శరత్ చంద్రా రెడ్డి భార్యకు చెందిన చార్టర్ ఫ్లైట్ లో కవిత ఢిల్లీకి వెళ్లిందని, ఒబేరాయ్ హోటల్ లో చర్చలు జరిపిందని, అక్కడే లిక్కర్ దందాలో వచ్చిన లాభాలను పంపిణీ చేసిందని పేర్కొంది ఈడీ. ఈ మొత్తం వ్యవహారంలో రామచంద్ర పిళ్లైని ముందుండి నడిపించింది ఎమ్మెల్సీ కవితేనని ఆరోపించింది. ఎల్ 1 లైసెన్సుల్లో 65 శాతం సౌత్ గ్రూప్ కు వెళ్లగా అత్యధిక వాటా 35 శాతం కవితమ్మదేనని వెల్లడించింది.
Also Read : పేరు పిళ్లైది దందా నడిపింది కవితే – ఈడీ