MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి – ఎమ్మెల్సీ కవిత

కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి - ఎమ్మెల్సీ కవిత

 

 

‘మా నాయకుడు కేసీఆర్‌ … ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుంది’ అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ చేరుకున్న ఆమెకు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో జాగృతి కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లేఖ రాయడంపై స్పందించారు. కేసీఆర్‌ కు తాను లేఖ రాశానని చెప్పారు. రెండు వారాల క్రితమే తాను లేఖ రాశానని… అయితే ఆ లేఖ ఎలా లీక్ అయ్యిందో తనకు అర్థం కావడం లేదన్నారు.

 

కవిత ఏమన్నారంటే ?

 

‘నేను కేసీఆర్‌‌కు లేఖ రాశాను. రెండు వారాల క్రితమే కేసీఆర్‌కు లేఖ రాశాను. నా అభిప్రాయాలను లేఖ ద్వారా తెలియజేశాను. కేసీఆర్‌కు రాసిన లేఖ ఎలా లీక్‌ అయిందో తెలియడం లేదు. కేసీఆర్‌ దేవుడు… కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. కేసీఆర్‌కు నేను రాసిన లేఖ బయటకు వస్తే… పార్టీలో ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటీ. కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని మొన్ననే చెప్పాను. నేను అంతర్గతంగా కేసీఆర్‌కు రాసిన ఉత్తరం బహిర్గతం కావడంపై పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. పార్టీలో నాయకులు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో ప్రస్తావించాను. గతంలోనూ నా తండ్రికి అంతర్గతంగా లేఖలు రాశా. కేసీఆరే మా నాయకుడు. కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తాం. నా లేఖ లీక్‌తో కాంగ్రెస్, బీజేపీ సంబరపడుతున్నాయి. కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తాం. పార్టీలోని కోవర్టులను పక్కకు తప్పిస్తే పార్టీ బాగుపడుతుంది. లేఖ రాయడంలో నా పర్సనల్ ఏజెండా ఏమీ లేదు.’ అని కవిత చెప్పుకొచ్చారు.

 

 

మా నాయకుడు కేసీఆర్‌ .. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుంది. కేసీఆర్‌ నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది. కోవర్టులను పక్కకు తప్పిస్తే పార్టీ బాగుపడుతుంది. పార్టీలో చిన్న చిన్న లోపాలను చర్చించుకోవాల్సిన అవసరముంది. నా తండ్రికి నేను రెగ్యులర్‌ గా లేఖలు రాస్తా. ఇందులో వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. నా లేఖ చూసి కాంగ్రెస్‌, భాజపా సంబర పడ్సాలిన పనిలేదు’’ అని కవిత అన్నారు. ఎల్కతుర్తి సభ తర్వాత పాజిటివ్‌, నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఇటీవల కవిత రాసిన లేఖ బయటికొచ్చింది. ఈ లేఖ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఆమె స్పందించారు.

Leave A Reply

Your Email Id will not be published!