MLC Kavitha ED : ఇండో స్పిరిట్ లో ఎమ్మెల్సీ కవితకు భాగం
సమీర్ మహేంద్రు చార్జ్ షీట్ లో వెల్లడి
MLC Kavitha ED : సమీర్ మహేంద్రు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న ఇండో స్పిరిట్ లో ఎమ్మెల్సీ కవితకు భాగం ఉందని స్పష్టం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)(MLC Kavitha ED). ఇండో స్పిరిట్ కు సంబంధించి అక్రమ మార్గంలో రూ. 192.8 కోట్ల లాభం వచ్చిందని తెలిపింది.
ఈ సంస్థలో కవితకు వాటా ఉందని ఆరోపించింది. ఇదే విషయాన్ని తమిళనాడుకు చెందిన రామచంద్ర పిళ్లై విచారణలో తేలిందని స్పష్టం చేసింది ఈడీ. సమీర్ మహేంద్రు విచారణ సందర్భంగా కీలక విషయాలు బయట పెట్టింది. మొత్తం 268 పేజీల చార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించింది.
గతంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారని ఆరోపించిన ఈడీ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కూడా ఎమ్మెల్సీ కవితకు భాగం ఉందని తేల్చింది. సౌత్ గ్రూప్ లో సమీర్ మహేంద్రు , ఎమ్మెల్సీ కవిత కీలక భూమిక పోషించిందని పేర్కొంది.
ఈ ఢిల్లీ లిక్కర్ స్కాంలో బోయనపల్లి అభిషేక్ రావు, అరుణ్ రామచంద్ర పిళ్లై , ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తనయుడు మాగుంట రాఘవ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కవితపై తీవ్రమైన అభియోగాలు మోపింది. వీరంతా సౌత్ గ్రూప్ లో అగ్ర భాగాన ఉన్నారని తెలిపింది.
ఇందులో భాగంగా ఈ ఏడాది 2022 జనవరిలో ఎమ్మెల్సీ కవితకు చెందిన హైదరాబాద్ నివాసంలో సమీర్ మహేంద్రు కలిశారని ఈడీ వెల్లడించింది. అంతకు ముందు 2021 మేలో కవిత ఇంట్లో అభిషేక్ రావును కూడా కలిశారని పేర్కొంది.
Also Read : మద్యం కుంభకోణంలో కవిత కీలకం – ఈడీ