MLC Kavitha ED : నా ఫోన్లు ఇవే క‌విత ఈడీకి స‌వాల్

అన్ని ఫోన్లు స‌మ‌ర్పించా

MLC Kavitha Letter ED : ఢిల్లీ లిక్క‌ర్ స్కాం కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత మంగ‌ళ‌వారం ఈడీ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఇదే కేసుకు సంబంధించి మార్చి 11న ఈడీ ముందుకు వెళ్లారు. ఉద‌యం 11 గంట‌ల‌కు హాజ‌రైన క‌విత రాత్రి 8.05 నిమిషాల‌కు తిరిగి వ‌చ్చారు.

మార్చి 16న హాజ‌రు కావాల‌ని ఈడీ నోటీసు ఇచ్చింది. దాదాపు 9 గంట‌ల పాటు విచార‌ణకు హాజ‌రైంది. ఇదే స‌మ‌యంలో తాను హాజ‌రు కాలేనంటూ లాయ‌ర్ సామ భ‌ర‌త్ ద్వారా ఈడీకి తెలియ చేసింది. అదే స‌మ‌యంలో ఎమ్మెల్సీ క‌విత సుప్రీంకోర్టును ఆశ్ర‌యించింది. త‌న‌ను విచార‌ణ చేప‌ట్ట‌కుండా ఉండేలా స్టే ఇవ్వాల‌ని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. 

దీనిపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. స్టే ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని ఎట్టి ప‌రిస్థితుల్లో ఈడీ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందేనంటూ స్ప‌ష్టం చేసింది. మార్చి 24న క‌విత పిటిష‌న్ పై త‌దుప‌రి విచారిస్తామ‌న్నారు. 

దీంతో ఎమ్మెల్సీ క‌విత (MLC Kavitha) మార్చి 20న ఈడీ ముందు మ‌రోసారి విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఉద‌యం 10.30 గంట‌ల‌కు హాజ‌రైన ఎమ్మెల్సీ రాత్రి 9.15 కి తిరిగి వ‌చ్చారు. ఇదే స‌మ‌యంలో మ‌రోసారి హాజ‌రు కావాల్సిందేనంటూ ఈడీ నోటీసులు ఇచ్చింది. మార్చి 21 మంగ‌ళ‌వారం రావాల‌ని నోటీసు అంద‌జేసింది.

ఈ సంద‌ర్భంగా సంచ‌ల‌న లేఖ రాశారు. ఆమె ఈడీపై ఆరోప‌ణ‌లు చేశారు. త‌న ఫోన్ల‌ను మీడియాకు ప్ర‌ద‌ర్శించారు. త‌న ఫోన్ల‌ను ధ్వంసం చేశార‌న్న ప్ర‌చారాన్ని తిప్పి కొట్టారు. ఈ ఫోన్ల‌ను తీసుకెళ్లార‌ని తెలిసింది. ఈడీ ఆఫీసులోకి క‌విత వెళ్ల‌గానే ఆమె రాసిన లేఖ(MLC Kavitha Letter ED) ఒక‌టి సంచ‌ల‌నంగా మారింది. ఈడీ ద‌ర్యాప్తు అధికారి జోగేంద్ర‌కు క‌ల్వ‌కుంట్ల క‌విత లేఖ రాశారు.

Also Read : కొత్త ఫ్రంట్ లో కేజ్రీవాల్ ఉంటారా

Leave A Reply

Your Email Id will not be published!