MLC Kavitha : ద‌మ్ముంటే రండి కొలువుల‌ లెక్క‌లు చూపిస్తా

నిరుద్యోగుల‌ను రెచ్చ‌గొడితే ఊరుకోం

MLC Kavitha : ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఎన్ని పోస్టుల‌ను భ‌ర్తీ చేశామ‌నేది అంకెల‌తో స‌హా చూపిస్తాన‌ని ద‌మ్ముంటే రావాల‌ని స‌వాల్ విసిరారు. ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌రంగా రాద్దాంతం చేస్తున్నాయ‌ని ఆరోపించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 82 వేలకు పైగా పోస్టుల భ‌ర్తీకి సంబంధించి నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసిన‌ట్లు తెలిపారు. గ్రూప్ -1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కూడా పూర్త‌యింద‌న్నారు. ఇంకా కొన్ని ప‌రీక్ష‌లు జ‌ర‌గాల్సి ఉంద‌న్నారు. పోస్టుల భ‌ర్తీ నిరంత‌ర ప్ర‌క్రియ అని దానిని కూడా రాజ‌కీయం చేయాల‌ని చూడ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు ఎమ్మెల్సీ క‌విత‌.

ఏయే శాఖ‌ల‌లో, ఏయే విభాగాల‌లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయ‌నేది ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేద‌న్నారు. ఇందుకు సంబంధించిన డేటా పూర్తిగా నెట్ లో ల‌భిస్తుంద‌ని ఓపిక గ‌నుక ఉంటే చూసుకోవాల‌న్నారు.

బిశ్వాల్ క‌మిటీ చెప్పిన మేర‌కు భ‌ర్తీ చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. అంతే కాకుండా ఇప్ప‌టికే అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్ర‌క‌టించిన మేర‌కు కాంట్రాక్టు కింద ప‌ని చేస్తున్న వారిని ప‌ర్మినెంట్ చేసే ప్ర‌క్రియ కూడా కొన‌సాగుతోంద‌న్నారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌(MLC Kavitha).

అంతే కాకుండా వేలాది మంది నిరుద్యోగుల‌కు ఉచితంగా శిక్ష‌ణ కూడా ఇస్తున్నామ‌ని చెప్పారు. విద్యార్థుల భ‌విష్య‌త్తు పాడుకాకుండా ఉండేందుకు భ‌ర్తీ ప్ర‌క్రియ సాగుతోంద‌న్నారు. వాస్త‌వాలు తెలుసు కోకుండా ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేయ‌డం ప్ర‌తిప‌క్షాలకు అల‌వాటుగా మారింద‌ని ఆరోపించారు క‌విత‌. ఇక కేంద్రంలో 10 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని ముందు వాటిని భ‌ర్తీ చేయాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

Also Read : రేవంత్ పై పీడీ యాక్ట్ న‌మోదు చేయాలి

Leave A Reply

Your Email Id will not be published!