MLC Kavitha Women Bill : తల వంచను భయపడను
స్పష్టం చేసిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha Women Bill : ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముద్దుల కూతురు , ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha Women Bill). ఆమె జాగృతి సంస్థకు చైర్మన్ గా ఉన్నారు. గతంలో ఎంపీగా కూడా పని చేశారు. ఆ తర్వాత ధర్మపురి అర్వింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ఎమ్మెల్సీ గా ఎంపికయ్యారు.
కానీ అనుకోకుండా ఢిల్లీ మద్యం కేసులో ఇరుక్కోవడం కలకలం రేపింది. ఈ మొత్తం స్కాంకు డాన్ గా వ్యవహరించిందంటూ సంచలన ఆరోపణలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపై ఈ కేసుకు సంబంధించి సీబీఐ 34 మందిపై అభియోగాలు మోపింది. 11 మందిని అరెస్ట్ చేసింది. సీబీఐ హైదరాబాద్ లో కవిత నివాసంలో ప్రశ్నించింది. దీనికి తెర దించుతూ కల్వకుంట్ల కవిత 10 ఫోన్లు ధ్వంసం చేసిందని, సమాచారం దొరకకుండా చేసిందంటూ సీబీఐ కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
ఇదే సమయంలో ఆప్ అగ్ర నాయకుడు , మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేసింది. ఆ తర్వాత మార్చి 11న 9 గంటల పాటు ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించింది. దీనిపై మరోసారి గురువారం మార్చి 16న రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది.
ఇందుకు సంబంధించి కోర్టును ఆశ్రయించింది కవిత. తనకు స్టే ఇవ్వాలంటూ కోరింది. ఇందులో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఆరోపించింది. కానీ సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు. 24కి వాయిదా వేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఢిల్లీలో స్పందించారు. తాను ఎవరికీ తల వంచే ప్రసక్తి లేదని, తాను ఎవరికీ భయపడనంటూ స్పష్టం చేశారు .
Also Read : బీఎల్ సంతోష్ కనబడటం లేదు