MLC Kavitha : కాంగ్రెస్ పార్టీ నాయకులు మా జోలికి వస్తే ఊరుకునేది లేదు
తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట అని కవిత అన్నారు...
MLC Kavitha : కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నీటిని కాకుండా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదల ఇళ్లను ప్రక్షాళన చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. మూసిని గోదావరితో అనుసంధానం చేయడానికి 1700 కోట్లతో కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. మళ్లీ రూ.7500 కోట్లతో మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీసుకురావడానికి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. మూసీని ఏటీఎంగా మార్చుకొని వచ్చిన డబ్బులను ఢిల్లీ పంపిస్తున్నారని ఆరోపించారు.
MLC Kavitha Slams
రౌడీమూకలతో దాడులు చేసే సంస్కృతి బీఆర్ఎస్‌ది కాదన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా మా జోలికి వస్తే ఖబడ్దార్’’ అంటూ హెచ్చరించారు. అప్లికేషను ఇవ్వగానే అన్ని ఇస్తాం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం నుంచి నీళ్లు విడుదల చేయకుండా రైతుల పంటలను ఎండ బెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని విమర్శించారు. నల్లగొండ మేథావుల్లారా కృష్ణ జలాలతో అన్యాయం జరుగుతుందని..ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ఒక్కటే అని ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట అని కవిత(MLC Kavitha) అన్నారు. కేసీఆర్ రూ.1200 కోట్లను పెట్టి అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రాజకీయాలకు అతీతంగా యాదాద్రి అభివృద్ధి జరగాలన్నారు. లక్ష్మీనరసింహ స్వామి పుష్కరిణిని విరజానది పుష్కరిణిగా భావిస్తారని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ గిరి ప్రదక్షిణలో పాల్గొనాలని కోరారు. మెట్ల ద్వారా స్వామివారి దర్శనం చేసుకుంటే గిరి ప్రదక్షిణం పూర్తవుతుందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం సంవత్సర కాలంలో అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలకు సేవ చేయడానికి లక్ష్మీనరసింహస్వామి వారి దీవెనలు ఇవ్వాలని కోరుకున్నట్లు ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
Also Read : Minister Narayana : అమరావతి నిర్మాణానికి హుడ్కో సంస్థ 11 వేల కోట్ల ఋణం