MLC Kavitha Slams : ఈడీ వచ్చినా సరే నన్ను రమ్మన్నా ఓకే
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్
MLC Kavitha Slams : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కావాలని కోరుతూ మార్చి 10న రాజధాని నగరంలో దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. భారత జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఇది కొనసాగుతుందని స్పష్టం చేశారు కవిత. గురువారం ఢిల్లీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha Slams) మీడియాతో మాట్లాడారు. ఇదే సమయంలో కేంద్ర సర్కార్ పై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు.
అంతకు ముందు తన సోదరుడు, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ కూడా ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఈడీ సమన్లు కాదని మోదీ సమన్లు అంటూ ఎద్దేవా చేశారు.
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీపై ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేపట్టడం లేదంటూ ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha). తాను చేపట్టే దీక్షకు 18 పార్టీలు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రతి బ్యాంకు ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తానని చెప్పారని కానీ ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు తమ ఇంటికి రావచ్చని తెలిపారు. ఒకవేళ కాదని అనుకుంటే తాను ఈడీ ఆఫీసు వద్దకు వస్తానని ప్రకటించారు.
ఇలాంటి కేసుల్లో మహిళలను ఇంట్లోనే విచారించే సంప్రదాయం ఉందని, లేదంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తారని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ స్వయంగా ఈడీ వద్దకు వెళ్లారు. ఆ విషయం కవిత మరిచి పోయినట్లున్నారు.
Also Read : అదానీపై ఈడీ ఎందుకు దాడి చేస్తలేదు