Mlc Kavitha: బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నా ఎమ్మెల్సీ కవిత !

బెయిల్‌ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నా ఎమ్మెల్సీ కవిత !

Mlc Kavitha: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ సీబీఐ కేసులో దాఖలు చేసిన డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ను ఎమ్మెల్సీ కవిత వెనక్కి తీసుకున్నారు. ఇదే పిటిషన్‌పై సోమవారం రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ తన తరుఫున వాదించే సీనియర్‌ న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో మరో రోజు విచారణ చేపట్టాలని కోరారు. కానీ అనూహ్యంగా ఈ రోజు పిటిషన్‌ను ఉప సంహరించుకున్నారు.

Mlc Kavitha Case Update

అయితే పిటిషన్‌ విత్‌డ్రాలో కవిత బెయిల్‌ కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం సుప్రీం కోర్టును ఆశ్రయించి.. అక్కడి నుంచి బెయిల్‌ పొందేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా రౌస్‌ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డీఫాల్ట్‌ బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

Also Read : Nara Lokesh: ఇకనుండి ఉపాధ్యాయులకు శ్రమ లేదు : మంత్రి లోకేశ్‌

Leave A Reply

Your Email Id will not be published!