MLC Kavitha Case : కవిత బెయిల్ బెయిల్ ఆశలపై నీళ్లు చల్లిన ఢిల్లీ హైకోర్టు

బెయిల్ కోసం హై కోర్టును కోరగా.. జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ జరిపి తీర్పు వెలువరించారు...

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ ఆశలపై ఢిల్లీ హైకోర్టు నీళ్లు చల్లింది. సోమవారం ఆమె బెయిల్ దరఖాస్తును విచారించిన కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. కవిత దాఖలు చేసిన రెండు బెయిల్ దరఖాస్తులను కోర్టు తిరస్కరించింది. మద్యం కుంభకోణం విచారణలో భాగంగా కవితను ఇప్పటికే ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

MLC Kavitha Case Updates

బెయిల్ కోసం హై కోర్టును కోరగా.. జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారణ జరిపి తీర్పు వెలువరించారు. ఈడీ, సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఈ కేసులో మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేసిన కవితకు బెయిల్ నిరాకరించారు. కవిత ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Also Read : TG News : తెలంగాణ లో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు శుభవార్త

Leave A Reply

Your Email Id will not be published!