MLC Kavitha : ఈడీ చార్జ్ షీట్ లో ఎమ్మెల్సీ కవిత
సీఎం కేసీఆర్ కు కోలుకోలేని షాక్
MLC Kavitha : నిన్నటి దాకా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్న ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) కోలుకోలేని షాక్ తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు పూర్తిగా నిఘా పెట్టాయి. ఇప్పటికే సీబీఐ నోటీసు ఇచ్చి విచారణ చేపట్టింది. తాజాగా మరో దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంచలన విషయాలు వెల్లడించింది.
ఈ మేరకు ఆమె ఎంతగా ఇందులో కీలక పాత్ర పోషించిందో కుండ బద్దలు కొట్టింది. ఇండో స్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రు విచారణలో సౌత్ గ్రూప్ చేసిన కార్యకలాపాల గురించి పూస గుచ్చినట్లు తెలిపింది. ఈ మేరకు సమీర్ మహేంద్రు పై 268 పేజీల నివేదికను కోర్టుకు సమర్పించింది ఈడీ.
ఈ కేసుకు సంబంధించి ఐదుగురిపై అభియోగాలు మోపింది. ఇక సౌత్ గ్రూప్ ను అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించారని వెల్లడించింది. ఎల్ 1 లైసెన్సుల్లో 65 శాతం గ్రూప్ కు వాటా ఉండగా ఎమ్మెల్సీ కవితకు 32 శాతం వాటా ఉందని స్పష్టం చేసింది ఈడీ.
ఇదే క్రమంలో ఇండో స్పిరిట్ కు అక్రమ మార్గంలో రూ. 192.8 కోట్ల లాభం వచ్చిందని తెలిపింది. వీటిని దొడ్డి దారిన ఆప్ కు చేరవేశారంటూ ఆరోపించింది. శరత్ చంద్రా రెడ్డికి చెందిన చార్టర్ ఫ్లైట్ లో సౌత్ గ్రూప్ ప్రయాణం చేసిందని పేర్కొంది. ఇండో స్పిరిట్ ను పూర్తిగా నడిపించింది ఎమ్మెల్సీ కవితేనని వెల్లడించింది.
Also Read : లిక్కర్ స్కాంలో కవితకు 32 శాతం వాటా