KTR Modi : ప్రజల దృష్టి మళ్లించేందుకే అగ్నిపథ్ స్కీం
ప్రధాని నరేంద్ర మోదీపై మంత్రి ఆగ్రహం
KTR Modi : తెలంగాణ ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ స్కీం వద్దంటూ నిరసనలు మిన్నంటాయి. ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
కానీ ఇప్పటి వరకు కేంద్ర సర్కార్ చిలుక పలుకులు పలకడంతోనే సరి పోయిందని ఎద్దేవా చేశారు. కేంద్రంలో బాధ్యత కలిగిన మంత్రులు బాధ్యతా రాహిత్యంతో మాట్లాడడం దారుణమని పేర్కొన్నారు.
కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మోదీ(KTR Modi) సర్కార్ పై మండిపడ్డారు. గత ఎనిమిదేళ్ల కాలంలో దేశంలో బీజేపీ ప్రభుత్వం సాధించేంది ఏమీ లేదు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం, వ్యాపారవేత్తలకు లాభం చేకూర్చడమే చేశారు.
మన్ కీ బాత్ అన్నారు. డిజిటల్ భారత్ అంటూ గొప్పలు పోయారు. కానీ వివాదాస్పద వ్యాఖ్యలతో దేశం పరువును తీసేశారని ఆరోపించారు. మోదీ ఎన్నికల సందర్భంగా ప్రతి పేదోడి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తానన్నారు.
ఆపై ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పారు. ఇప్పటి వరకు కేంద్ర సర్కార్ ఎన్ని పోస్టులు భర్తీ చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
అగ్నిపథ్ లో యువత డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, బార్బర్లుగా ఉపాధి పొందవచ్చంటూ కిషన్ రెడ్డి చెప్పడం పై మండిపడ్డారు. అగ్ని వీరులను ట్రైనింగ్ అయి పోయాక తమ ఆఫీసులలో సెక్యూరిటీ గార్డులు నియమిస్తామని జాతీయ నేత కైలాష్ కామెంట్ చేశారు.
ఇదేనా మీరు ఈ జాతికి, యువతకు ఇచ్చే సందేశం అని ప్రశ్నించారు కేటీఆర్. భారతీయుల దృష్టి మళ్లించేందుకే అగ్నిపథ్ ను తీసుకు వచ్చారంటూ ఆరోపించారు.
Also Read : ట్రబుల్ షూటర్ తో టార్చ్ బేరర్ భేటీ