Modi Brutally Viral : మోదీ హ‌యాంలో ప్ర‌జాస్వామ్యం ఖూనీ

ఢిల్లీ ఆప్ మ‌హా ర్యాలీలో పీఎంకు వ్య‌తిరేక ప్ర‌ద‌ర్శ‌న

Modi Brutally Viral : న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ స‌ర్కార్ తీసుకు వ‌చ్చిన ఆర్డినెన్స్ కు వ్య‌తిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆదివారం ఢిల్లీలో భారీ మ‌హా ర్యాలీ చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు ఓ నాయ‌కుడు. టీ ష‌ర్ట్ ను ధ‌రించాడు. దీనిపై ప్ర‌జాస్వామ్యాన్ని న‌రేంద్ర మోదీ(Narendra Modi) ఖూనీ చేశారంటూ ధ‌రించ‌డం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. పెద్ద ఎత్తున మోదీ పై వ్య‌తిరేకంగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఢిల్లీ ప్ర‌భుత్వంపై పెత్త‌నం చెలాయించేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తీసుకు వ‌చ్చింది. దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ఆప్ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్. ప్ర‌జాస్వామిక వాదులు దీనిని ఖండించాల‌ని కోరారు.

గ‌త కొంత కాలంగా కేంద్రం, ఢిల్లీ స‌ర్కార్ మ‌ధ్య ఆధిప‌త్య పోరు కొన‌సాగుతూ వ‌చ్చింది. ఎవ‌రికి ప‌వ‌ర్స్ ఉన్నాయ‌నే దానిపై ఇరువురు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. సీజేఐ జ‌స్టిస్ ధ‌నంజ‌య చంద్ర‌చూడ్ ఆధ్వ‌ర్యంలోని ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న తీర్పు చెప్పింది. ఎల్జీకి కేవ‌లం శాంతి భ‌ద్ర‌త‌లు, భూ సంబంధిత అంశాలు త‌ప్ప ఇంకే అధికారాలు ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. చివ‌ర‌కు ఆర్డినెన్స్ ను పార్ల‌మెంట్ లో చ‌ట్టంగా తీసుకు వ‌చ్చేందుకు కేంద్రం ప్ర‌య‌త్నిస్తోంది. కాగా లోక్ స‌భ‌లో బ‌లం ఎక్కువ‌గా బీజేపీకి ఉండ‌గా రాజ్య‌స‌భ‌లో లేదు.

Also Read : Shakti Scheme : ఉచిత ప్ర‌యాణం ‘శ‌క్తి’ ప్రారంభం

Leave A Reply

Your Email Id will not be published!