Rahul Gandhi PM Modi : ప్రజాస్వామ్యానికి మోదీ పాతర – రాహుల్
ఇక పార్లమెంట్ పని చేసే స్థితిలో లేదు
Rahul Gandhi PM Modi : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అరాచక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. హిందుత్వం పేరుతో విద్వేషాన్ని రగిలిస్తోందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఫాసిజం ఇప్పటికే ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ ఇక పని చేయదన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi PM Modi). ఇటాలియన్ దినపత్రిక కొరియర్ డెల్లా సెరాకు కాంగ్రెస్ నేత ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
హిందువులు, ముస్లింల మధ్య పోలరైజేషన్ ను గాంధీ అంగీకరించారు. అయితే భారతీయ మీడియా దానిని చిత్రీకరిస్తున్నంత భయంకరమైన పరిస్థితి లేదని నొక్కి చెప్పారు. భారత్ జోడో యాత్రలో తన అనుభవాన్ని ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఎలా ఓడించవచ్చో కూడా స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ఇందిరా గాంధీతో ఉన్న మధురమైన జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు. 52 ఏళ్ల వయస్సులో ఎందుకు ఒంటరిగా ఉన్నాడనే దానిపై సమాధానం ఇచ్చారు. తాను చేపట్టిన యాత్ర ఒక త్యాగం లాంటిదన్నారు. ఇరు వర్గాల మధ్య కొంత దూరం ఉందనేది వాస్తవమని అంగీకరించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ప్రస్తుతం భయంకరమైన పరిస్థితులు లేవన్నారు.
పేదరికం వంటి మరింత భయంకరమైన వాస్తవ సమస్యల నుండి ప్రజలను మళ్లించేందుకు ఇది ఒక సాధనమని పేర్కొన్నారు. నిరక్షరాస్యత, ద్రవ్యోల్బణం, చిన్న, రుణ గ్రస్తులైన పారిశ్రామికవేత్తలు , భూమిలేని రైతుల కోవిడ్ అనంతర సంక్షోభం ప్రధాన సమస్యలు ఉన్నాయని ప్రస్తావించారు రాహుల్ గాంధీ. ఫాసిజం ఇంకా కొనసాగుతోంది..ప్రజాస్వామ్యం చచ్చి పోయిందన్నారు.
Also Read : నాకంటూ వ్యక్తిగత ఎజెండా లేదు