Supreme Court Judges : ఐదుగురు న్యాయ‌మూర్తుల‌కు ఓకే

వెల్ల‌డించిన మంత్రి కిరెన్ రిజిజు

Supreme Court Judges : సుదీర్ఘ కాలం త‌ర్వాత కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం స్పందించింది. ఈ మేరేకు కొలీజియం సిఫార‌సు చేసిన న్యాయ‌మూర్తుల నియామ‌కానికి సంబంధించి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. న్యాయ‌మూర్తులు, జ‌డ్జీల నియామ‌కంలో కేంద్ర స‌ర్కార్ నాన్చుడు ధోర‌ణి ప్ర‌ద‌ర్శిస్తోందంటూ సుప్రీంకోర్టు సీరియ‌స్ అయ్యింది. ఇది మంచి ప‌ద్ద‌తి కాదంటూ స్ప‌ష్టం చేసింది. దీంతో తీవ్ర వాదోప‌వాదాలు జ‌రిగిన త‌ర్వాత ఐదుగురు న్యాయ‌మూర్తుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

ఈ విష‌యాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు ప్ర‌క‌టించారు. ఇక సుప్రీంకోర్టులో న్యాయ‌మూర్తులుగా(Supreme Court Judges)  ఎంపికైన వారిలో తెలుగు వాడైన జ‌డ్జి కూడా ఉండ‌డం విశేషం. ప్ర‌స్తుతం మ‌ణిపూర్ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ గా ఉన్నారు పీవీ సంజ‌య్ కుమార్.

ఆయ‌న‌తో పాటు రాజ‌స్థాన్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి పంక‌జ్ మిత్త‌ల్ , పాట్నా హైకోర్టు సీజే జ‌స్టిస్ సంజ‌య్ క‌రోల్ , పాట్నా హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎహ‌సానుద్దీన్ అమానుల్లా, అలాహాబాద్ హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ మ‌నోజ‌జ్ మిశ్రాల‌కు సుప్రీంకోర్టు జ‌డ్జీలుగా ప‌దోన్న‌తి ల‌భించింది.

ఇదిలా ఉండ‌గా ఈ ఐదుగురు న్యాయ‌మూర్తుల పేర్ల‌ను సుప్రీంకోర్టు కొలీజియం గ‌త ఏడాది 2022 డిసెంబ‌ర్ 13న సిఫార‌సు చేసింది. మోదీ ప్ర‌భుత్వం రెండు నెల‌ల విరామం త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ఆమోదం తెలిపింది. కొత్త‌గా ఐదుగురు జ‌డ్జీల‌తో క‌లుపుకుని సుప్రీంకోర్టులో మొత్తం న్యాయ‌మూర్తుల సంఖ్య 32కి చేరింది. ఇదిలా ఉండ‌గా న్యాయ‌మూర్తుల నియామ‌కం విష‌యంలో జోక్యంపై సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది కేంద్ర ప్ర‌భుత్వంపై.

Also Read : జార్ఖండ్ స‌ర్కార్ అవినీతికి కేరాఫ్ – షా

Leave A Reply

Your Email Id will not be published!