Austrian FM : రష్యాను ఒప్పించాలంటే మోదీనే బెటర్
జై శంకర్ తో అలెగ్జాండర్ షాలెన్ బర్గ్
Austrian FM : ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల జరిగిన షాంఘై కోఆపరేషన్ కమిటీ కీలక భేటీలో రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక అంశాలపై చర్చించారు.
యుద్దం ఎంత మాత్రం ఆమోద యోగ్యం కాదని, వెంటనే ఉక్రెయిన్ పై దాడులను నిలిపి వేయాలంటూ కోరారు. అంతే కాకుండా ప్రధానమంత్రి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రశంసలు అందుకున్నాయి.
ఇది యుద్ధానికి సంబంధించిన యుగం కాదని పేర్కొన్నారు. ప్రపంచానికి ఉగ్రవాదం పెను ముప్పుగా మారిందని దానిని ఎదుర్కొనేందుకు దేశాలన్నీ సమన్వయంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం కొనసాగుతున్న యుద్దాన్ని నివారించాలంటే ప్రధాని మోదీ ఒక్కరే సరైన వ్యక్తి అని కితాబు ఇచ్చారు ఆస్ట్రియా విదేశాంగ శాఖ మంత్రి అలెగ్జాండర్ షాలెన్ బర్గ్(Austrian FM) .
ఈ సందర్భంగా ఆయన భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ ను కలిశారు. యూరప్ దేశాల కంటే భారత దేశం కీలకమైన పాత్ర పోషించేందుకు ముందుకు రావాలని కోరారు షాలెన్ బర్గ్.
ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యుఎన్జీఏ) సందర్భంగా ఆస్ట్రియా విదేశాంగ శాఖ మంత్రి భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత జనవరి నుండి ఇప్పటి వరకు జై శంకర్ ను కలవడం ఇది నాలుగోసారి. ఉక్రెయిన్ పై జరుగుతున్న యుద్దం ప్రపంచానికి పెను సవాల్ అని పేర్కొన్నారు ఆస్ట్రియా విదేశాంగ శాఖ మంత్రి.
Also Read : చైనా సవాల్ పాకిస్తాన్ బలాదూర్