Modi : భార‌తీయ ఉత్ప‌త్తుల ప్ర‌తిష్ట‌ను పెంచాలి

లోక‌ల్ ను గ్లోబ‌ల్ స్థాయికి తీసుకు వెళ్లాలి

Modi : భార‌తీయ ఉత్ప‌త్తుల ప్ర‌తిష్ట‌ను ప్ర‌పంచానికి చాటి చెప్పాల‌ని దేశ ప్ర‌ధాన మంత్రి(Modi) పిలుపునిచ్చారు. లోక‌ల్ మేడ్ త‌యారీని మ‌రింత పెంచాల‌న్నారు. భార‌త దేశ సామ‌ర్థ్యాన్ని ఈ సంద‌ర్భంగా కొనియాడారు.

దేశంలోని రైతులు, చేతి వృత్తులు, చేనేత కార్మికులు, ఇంజ‌నీర్లు, చిన్న పారిశ్రామికేవ‌త్త‌లు, ఎంఎస్ఎంఇ , అనేక విభిన్న వృత్తుల‌కు చెందిన వ్య‌క్తులు ఉన్నార‌ని తెలిపారు ప్ర‌ధాని.

భార‌త దేశం ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో 400 బిలియ‌న్ డాల‌ర్ల ఎగుమ‌తి ల‌క్ష్యాన్ని సాధించింద‌ని స్ప‌ష్టం చేశారు. దీని వ‌ల్ల భార‌తీయ వ‌స్తువుల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంద‌న్న‌ది దీన్ని బ‌ట్టి చూస్తే అర్థ‌మ‌వుతుంద‌న్నారు.

ప్ర‌తి భార‌తీయుడు స్థానికంగా ఉంటూ దీనిని సాధించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌న్నారు. స్థానికం గ్లోబ‌ల్ గా మారేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌ద‌న్నారు. ప్ర‌తి నెలా మ‌న్ కీ బాత్ రేడియో లో జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

మీ అంద‌రి కృషి వ‌ల్ల‌నే 400 మిలియ‌న్ డాల‌ర్ల‌కు ఎగుమ‌తి ఉంద‌న్నారు. ప్ర‌పంచంలోని ప్ర‌తి మూల‌, మూలాల్లోకి కొత్త మార్కెట్ లోకి చేరుకోవ‌డం సంతోషాన్ని క‌లిగిస్తోంద‌ని చెప్పారు మోదీ(Modi).

ప్ర‌తి భార‌తీయుడు లోక‌ల్ కోసం గ‌ళం విప్పితే లోక‌ల్ గ్లోబ‌ల్ గా మారేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌ద‌న్నారు. మ‌న ఉత్ప‌త్తుల ప్ర‌తిష్ట‌ను మ‌రింత పెంచుకుందామ‌ని పిలుపునిచ్చారు.

ఎగుమ‌తుల వ‌ల్ల భార‌త్ కు ఇది మంచి శుభ ప‌రిణామ‌మ‌ని పేర్కొన్నారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు బ‌లంగా మార‌నుంద‌న్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌త్ లో త‌యార్యే వ‌స్తువుల‌కు రానున్న కాలంలో డిమాండ్ పెర‌గ‌డం ఖాయ‌మ‌న్నారు.

Also Read : అనాధ పిల్ల‌ల కోసం రూ. 10 కోట్లు

Leave A Reply

Your Email Id will not be published!