Modi : ఈ దేశంలో సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీగా పేరొందిన కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చేలా చేయడంలో భారీ సక్సెస్ అయ్యారు భారతీ జనతా పార్టీకి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ.
తాను చాయ్ వాలా నంటూ జనాన్ని మెస్మరైజ్ చేసి పవర్ లోకి వచ్చిన మోదీ రెండో సారి పీఎం అయ్యారు.
పోల్ మేనేజ్ మెంట్, ఎన్నికల మేనేజ్ మెంట్ చేయడంలో బీజేపీ తర్వాతే ఎవరైనా ఏ పార్టీ అయినా అనేంత స్థాయికి తీసుకు వెళ్ళారు.
ఓ సామాన్య కార్యకర్తగా ప్రారంభించి దేశానికి పీఎం (Modi)అయ్యాక ఆ పార్టీని నడిపించడంలోనూ తనకు తానే సాటి అనిపించుకున్నారు.
ఇక్కడ ప్రధానంగా చెప్పు కోవాల్సింది మోదీ. ఎక్కువగా మాట్లాడక పోవడం ఆయన నైజం.
కానీ ఎప్పుడు ఎవరిని ఎలా దెబ్బ కొట్టాలో ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు.
దేశానికి సెమీ ఫైనల్స్ గా భావించిన ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ను మరోసారి గట్టెక్కించే బాధ్యతను మోదీనే స్వయంగా తలకెత్తుకున్నారు.
ఓ వైపు ఒంటెద్దు పోకడ, రైతుల పట్ల అనుసరించిన విధానం ఇవన్నీ పార్టీకి మచ్చ తెచ్చినా వాటిని
కవర్ చేయడంలో ప్రధాని సక్సెస్ కాగలిగారు. ఇక ట్రబుల్ షూటర్ గా పేరొందిన అమిత్ షా,
పార్టీ చీఫ్ జేపీ నడ్డా, సీఎం యోగి వీరందరూ ఉన్నా మోదీ తనదైన మార్కు తో పార్టీని మరోసారి పవర్ లోకి తీసుకు రావడంలో కీలక పాత్ర పోషించారు.
విపక్షాలపై విసుర్లు, సంక్షేమ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయడం, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా ప్రతి దానిలో మోదీ మార్క్ కనిపించింది.
గతంలో 317 సీట్లు గెలుపొందిన బీజేపీ ఆ మార్క్ (Modi)దాటలేక పోయినా ఇంకో సారి అధికారంలోకి రానుండడం ఖాయం.
నువ్వా నేనా అని చివరి వరకు సాగిన పోరులో భారతీయ జనతా పార్టీ ప్రమాణ స్వీకారం చేయడం వాస్తవం. ఇంకొద్ది గంటల్లో దాని భవితవ్యం తేలిపోంది.
పంజాబ్ లో బీజేపీని ఆదరించ లేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. ఇక మోదీ త్రయం బెంగాల్ లో ప్రయత్నించినా అక్కడ వర్కవుట్ కాలేదు.
కానీ యూపీ, మణిపూర్ , ఉత్తరాఖండ్ లో ఆధిక్యం దిశగా తీసుకు రావడంలో మోదీ పాత్ర విస్మరించ లేనిది.
విచిత్రం ఏమిటంటే గోవాలో హంగ్ దిశగా వెళుతుండడం ఒకింత బిజేపీని షాక్ కు గురి చేసిందనే చెప్పక తప్పదు. యూపీలో మాత్రం మోదీ , అమిత్ షా, యోగి ల మంత్రం పని చేసిందని చెప్పక తప్పదు.
Also Read : యోగీకే పట్టం అఖిలేష్ కు మంగళం