Modi Posters 100 FIR : ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీకి(PM Modi) వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్టర్లు వేసినందుకు 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి మరియు కనీసం ఆరుగురిని అరెస్టు చేశారు. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని పోస్టర్లపై “మోదీ హటావో దేశ్ బచావో” అని రాసి ఉంది.
ఈ మేరకు ఢిల్లీ పోలీసులు 100కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు(Modi Posters 100 FIR) నమోదు చేశారని, నగరవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పోస్టర్లు వేసినందుకు ఆరుగురిని అరెస్టు చేశారని స్పెషల్ సీపీ దీపేంద్ర పాఠక్ మీడియా తో తెలిపారు.
అయితే పోస్టర్లపై ప్రింటింగ్ ప్రెస్ లేదా పబ్లిషర్ ప్రస్తావన లేదు. దీనిపై ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. ప్రింటింగ్ ప్రెస్ యాక్ట్, డిఫేస్‌మెంట్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ల కింద నగరంలోని వివిధ జిల్లాల్లో 100 ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యాలయం నుండి బయలుదేరిన వెంటనే ఒక వ్యాన్‌ను కూడా అడ్డగించారని స్పెషల్ సీపీ తెలిపారు. కొన్ని పోస్టర్లను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోంది.
Also Read : పీహెచ్‌డీ విద్యార్థిని సస్పెండ్ చేయడంపై శశి థరూర్ ఆగ్రహం