Modi Draupadi Murmu : రాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారు – మోదీ
ద్రౌపది ముర్ము ఎంపికపై ప్రధానమంత్రి
Modi Draupadi Murmu : భారతీయ జనతా పార్టీ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడుతుంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్న విషయం ఎన్డీయే పక్షాన అభ్యర్థిగా ఎంపిక చేసిన ద్రౌపది ముర్మునే నిదర్శనం.
గతంలో దళిత వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ కు అవకాశం ఇచ్చింది. తాజాగా ఒడిశా మట్టి బిడ్డ, ఆదివాసీ ఆణిముత్యం ద్రౌపది ముర్మును రాష్ట్రపతి పదవి కోసం ఎంపిక చేయడం జరిగిందన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi Draupadi Murmu).
ఆయన ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశానికి ద్రౌపది ముర్ము గొప్ప రాష్ట్రపతి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ద్రౌపది ముర్ము సమాజ సేవకు అంకితం అయ్యారు.
నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. పేద, బడుగు, బలహీన, మైనార్టీ, ఆదివాసీ, గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆమె దగ్గరుండి చూశారని పేర్కొన్నారు.
అంతే కాదు అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన అరుదైన నాయకురాలని ప్రశంసించారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
జూనియర్ అసిస్టెంట్ గా ప్రారంభించి, కౌన్సిలర్ గా ఎన్నికై ఆ తర్వాత మంత్రిగా పని చేశారు. అనంతరం గవర్నర్ గా తనదైన ముద్ర వేశారని కితాబు ఇచ్చారు ప్రధానమంత్రి(Modi Draupadi Murmu).
పరిపాలనా పరంగా ద్రౌపది ముర్ముకు అపారమైన అనుభవం ఉందని, అత్యుత్తమ సేవలు అందించారని ప్రశంసించారు.
ఆమె తదుపరి కొలువు తీరే రాష్ట్రపతి పదవికి వన్నె తీసుకు వస్తారన్న నమ్మకం, విశ్వాసం తనకు ఉందంటూ స్పష్టం చేశారు మోదీ.
ముర్ము ఎంపిక చేయడం దేశ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచి పోతుందని పేర్కొన్నారు.
Also Read : ముదిరిన సంక్షోభం గౌహతికి చేరిన రాజకీయం