Donald Trump : ట్రంప్ ప్రసంగంలో వెల్లువెత్తిన మోదీ నినాదాలు
దాదాపుగెలుపు ఖాయం కావడంతో రిజల్ట్కు ముందే తనకు తానుగానే గెలిచినట్టుగా ట్రంప్ ప్రకటించుకున్నాడు...
Donald Trump : అమెరికా అధ్యక్షుడి రేసులో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump)కు ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రెండో సారి అధ్యక్ష రేసులో గెలిచి విజయ బావుటా ఎగరేసిన ట్రంప్ ఈ సారి ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఉపయోగించిన స్ట్రాటజీ పలువురిని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా భారత ప్రధాని మోదీని ట్రంప్ ఈ విషయంలో కాపీ కొట్టారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ట్రంప్ గెలుపునకు ఇది కూడా కీలకంగా పనిచేసిందంటున్నారు. తాజాగా ట్రంప్ గెలిచిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రసంగంలోనూ మోదీ నినాదాలు వినిపించడం విశేషం.
Donald Trump Speech
దాదాపుగెలుపు ఖాయం కావడంతో రిజల్ట్కు ముందే తనకు తానుగానే గెలిచినట్టుగా ట్రంప్ ప్రకటించుకున్నాడు. ఫ్లోరిడాలో మద్దతుదారుల ఆనందోత్సాహాల మధ్య ట్రంప్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. భార్య మెలానియా ట్రంప్, సహచరుడు జేడీ వాన్స్‌తో పాటు ప్రచార సిబ్బందితో సహా ఆయన వేదికపైకి వచ్చారు. దీనిని రాజకీయ విజయంగా ట్రంప్ అభివర్ణించారు. అమెరికా అధ్యక్షుడిగా తనకు రెండో సారి అవకాశం ఇచ్చిన ప్రజలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. ”అమెరికా ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. దేశ పునర్నిర్మాణానికి కృషి చేస్తాం” అని ట్రంప్ అన్నారు.
చాలాకాలంగా భారత రాజకీయ వ్యూహాలను అనుసరిస్తున్న ట్రంప్ పీఆర్ వ్యూహం మోదీ 2014 ఎలక్షన్ క్యాంపెయిన్ కు చాలా దగ్గరగా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. చాయ్ వాలా అంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలనే స్లోగన్ గా మార్చుకుని మోదీ తన గెలుపునకు బాటలు వేసుకున్న సంగతి తెలిసిందే. అచ్చం అదే తీరుగా ట్రంప్ సైతం ఈ సారి ఎలక్షన్ క్యాంపెయిన్ లో మోదీ స్ట్రాటజీని ఫాలో అయినట్టు కనిపించారు. ట్రంప్ మద్దతుదారులను జో బైడెన్ చెత్త కుప్ప అని పిలవడంతో దానినే అస్త్రంగా చేసుకుని ట్రంప్ ఎన్నికల్లో ప్రచారం చేసి సక్సెస్ అయ్యాడు.
Also Read : JD Vance : అమెరికా ఉప అధ్యక్షుడి పదవికి ఆంధ్రప్రదేశ్ అల్లుడు