Rahul Gandhi : బిల్కిస్ రేపిస్టులకు మోదీ సపోర్ట్ – రాహుల్
కాంగ్రెస్ అగ్ర నేత షాకింగ్ కామెంట్స్
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో పై అత్యాచారానికి పాల్పడి, కుటుంబీకులను హత్యకు పాల్పడిన నిందితులకు జీవిత ఖైదు విధించారు.
14 ఏళ్ల తర్వాత సదరు ఖైదీలలో ప్రవర్తనలో మార్పు వచ్చిందని, అందుకే తాము విడుదల చేస్తామంటూ ప్రకటించింది గుజరాత్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కూడా గుజరాత్ సర్కార్ కు ఓకే చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళన, నిరసన వ్యక్తమైంది.
దీనిపై మంగళవారం సీరియస్ గా స్పందించారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). 135 కోట్ల మంది ప్రజలు కలిగిన భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిస్సిగ్గుగా రేపిస్టులకు మద్దతు పలుకుతున్నారంటూ సంచనల ఆరోపణలు చేశారు. బిల్కిస్ బానో రేపిస్టుల విడుదల విషయంలో కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం తొందరపడినట్లుగా తాజాగా ఓ నివేదిక విడుదలైంది.
ఈ నేపథ్యంలో ఆ రిపోర్టును ప్రత్యేకంగా ప్రస్తావించారు రాహుల్ గాంధీ. పంధ్రాగస్టు సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రసంగించిన మోదీ మహిళలు లేక పోతే దేశం లేదన్నారు. కానీ ఆచరణలోకి వస్తే విరుద్దంగా చర్యలు ఉంటాయని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నా మరో వైపు ట్వీట్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బిల్కిస్ బానో విషయంలో జరిగిన అన్యాయం మహిళలకు జరిగిన మోసంగా అభివర్ణించారు రాహుల్ గాంధీ.
Also Read : బిల్కిస్ బానో రేపిస్టుల విడుదలపై విచారణ