Wayanad landslide:  వయనాడ్‌కు ప్రధాని మోదీ జాతీయ విపత్తుగా ప్రకటించేనా..!

 వయనాడ్‌కు ప్రధాని మోదీ జాతీయ విపత్తుగా ప్రకటించేనా..!

Wayanad landslide: ప్రకృతి సృష్టించిన బీభత్సంతో కేరళలో వయనాడ్ జిల్లాలోని చూరల్మల, ముండక్క గ్రామాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్ట్ 10వ తేదీన.. అంటే శనివారం ఆ యా గ్రామాల్లో పర్యటించనున్నారు. అలాగే నిరాశ్రయులు తలదాచుకున్న పునరావాస కేంద్రాలను సైతం ఆయన ఈ పర్యటనలో భాగంగా సందర్శించనున్నారు.

వయనాడ్‌‌(Wayanad Landslide)లో చోటు చేసుకున్న ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోపాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ఎంపీలు విజ్జప్తి చేసిన విషయం విధితమే. అలాంటి వేళ ప్రధాని మోదీ వయనాడ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన అనంతరం జాతీయ విపత్తుగా ప్రధాని మోదీ ప్రకటించే అవకాశముందని ఓ చర్చ సైతం జరుగుతుంది.

Wayanad landslide – 417కు చేరిన మృతులు సంఖ్య..

వయనాడ్‌ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు, కొండ చరియలు విరిగి పడడంతో మృతుల సంఖ్య 417కు చేరింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. అలాగే వందలాది మంది గల్లంతయ్యారు. వారి కోసం నేటికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 10 వేల మందికి పైగా నిరాశ్రయులు వివిధ పునరావాస కేంద్రాల్లో తల దాచుకున్న సంగతి తెలిసిందే.

Also Read : MP Akhilesh Yadav : లోక్ సభ స్పీకర్ బాధ్యతలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!