PM Modi Vote : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన మోదీ
సాయంత్రం కల్లా ఫలితం వెల్లడయ్యే చాన్స్
PM Modi Vote : భారత దేశంలో అత్యున్నత రెండో పదవిగా భావించే ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి శనివారం పోలింగ్ ప్రారంభమైంది. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం తరపున ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్ ఖర్ పోటీలో ఉన్నారు.
ఇక ప్రతిపక్షాల ఉమ్మడి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి మార్గరెట్ అల్వా బరిలో నిలిచారు. ఈ సందర్భంగా భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi Vote) తన విలువైన ఓటు ను వినియోగించుకున్నారు.
పార్లమెంట్ హాలులో ఏర్పాటు చేసిన బాక్సులో ఆయన తన ఓటు వేశారు. సరిగ్గా ఉదయం 10 గంటలకు ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్ స్టార్ట్ అయ్యింది.
ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఇక సాయంత్రం తర్వాత ఫలితం వెలువడే చాన్స్ ఉంది. బీజేపీ, సంకీర్ణ పార్టీల బలంతో కలుపుకుంటే విపక్షాల కంటే ఎక్కువ సీట్లు కూడా ఉన్నాయి.
ఇండిపెండెంట్లు, నామినేటెడ్ పదవులు పొందిన వారు కూడా మోదీ సర్కార్ అభ్యర్థికే మొగ్గు చూపారు. దీంతో జగదీప్ ధన్ ఖర్ ఉప రాష్ట్రపతి గా ఎంపిక కావడం లాంఛనీయమే.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఉప రాష్ట్రపతిగా ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగిసి పోనుంది. ఇక మార్గరెట్ అల్వా గతంలో గవర్నర్ గా కూడా పని చేశారు.
ఆమె వయస్సు 80 ఏళ్లు కాగా జగదీప్ ఇటీవలే గవర్నర్ పదవికి రిజైన్ చేసి ఉప రాష్ట్రపతి బరిలో నిలిచారు.
Also Read : యూపీలో ఆడపడుచులకు ఉచిత ప్రయాణం