Amit Shah Modi : మోదీ జీవితం నిబద్దతకు నిదర్శనం
పుట్టిన రోజు సందర్భంగా అమిత్ షా
Amit Shah Modi : భారత దేశానికి 15వ మంత్రిగా కొలువు తీరిన నరేంద్ర దామోదర దాస్ మోదీ పుట్టిన రోజు ఇవాళ. ఆయన 17 సెప్టెంబర్ 1950లో పుట్టారు. గుజరాత్ లోని వాద్ నగర్ ఆయన స్వస్థలం.
ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah Modi) గ్రీటింగ్స్ తెలిపారు.
మోదీ అంటే వ్యక్తి కాదని ఓ శక్తి అని పేర్కొన్నారు. నిరంతర సేవకు, అంకిత భావానికి, నిబద్ధతకు నిదర్శనమని ప్రశంసించారు షా. ఇదిలా ఉండగా 26 మే 2014న తొలిసారిగా దేశ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
రెండోసారి పీఎంగా ఎన్నికయ్యారు. సురక్షితమైన, దృఢమైన , స్వావలంబనను కలిగిన న్యూ ఇండియా సృష్టికర్త నరేంద్ర మోదీ అని కొనియాడారు.
పేదల సంక్షేమం, సుపరిపాలన, జాతీయ భద్రత, అభివృద్ది, చారిత్రక సంస్కరణల సమాంతర సమన్వయంతో భారత దేశాన్ని అన్ని రంగాలలో ముందంజలో తీసుకు పోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని స్పష్టం చేశారు.
సమున్నత భారతావనిని సగర్వంగా తల ఎత్తుకునేలా చేయడంలో కీలకంగా పని చేస్తున్నారంటూ ప్రశంసలతో ముంచెత్తారు అమిత్ చంద్ర షా.
నిర్ణయాత్మక నాయకత్వం, ఆ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న అచంచల విశ్వాసం వల్లే ఇదంతా సాధ్యమైందని పేర్కొన్నారు. కోట్లాది మంది పేదలకు వారి హక్కులను అందించడం ద్వారా మోడీ ఆశా భావాన్ని కలిగించారని తెలిపారు.
నవ భారత నిర్మాతగా మోదీ ఎల్లప్పటికీ స్పూర్తి దాయకంగా నిలుస్తారని అన్నారు అమిత్ షా.
Also Read : విద్య తోనే భారత దేశం అభివృద్ది