Mohammad Azharuddin : రాహుల్ యాత్రలో అజ్జూ భాయ్

క‌లిసి న‌డిచిన మాజీ కెప్టెన్

Mohammad Azharuddin : కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర కొన‌సాగుతోంది. చిన్నారుల నుంచి పెద్ద‌ల దాకా ప్ర‌తి ఒక్క‌రు యాత్ర‌కు జేజేలు ప‌లుకుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్ర‌ముఖ బ‌హు భాష న‌టి పూన‌మ్ కౌర్ రాహుల్ గాంధీని క‌లుసుకున్నారు.

ఈ త‌రుణంలో భార‌త క్రికెట్ జ‌ట్టుకు ఎన‌లేని విజ‌యాలు సాధించి పెట్టిన మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్(Mohammad Azharuddin) రాహుల్ గాంధీ యాత్ర‌లో పాల్గొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వేయికి పైగా కిలోమీట‌ర్లు న‌డిచారు. ఉస్మానియా విశ్వ విద్యాల‌యం విద్యార్థులు కూడా ఇందులో పాలు పంచు కోవ‌డం విశేషం.

ప్ర‌స్తుతం షాద్ న‌గ‌ర్ మీదుగా శంషాబాద్ కు చేరుకున్నారు. ఇక్క‌డ మీడియాతో సంభాషిస్తారు రాహుల్ గాంధీ. ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీతో చాలా సేపు ముచ్చ‌టించారు మ‌హ్మ‌ద్ అజారుద్దీన్. రాహుల్ తో క‌లిసి న‌డ‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. మీడియా ఆ ఇద్ద‌రితో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నం చేసింది.

ఇదిలా ఉండ‌గా తెలంగాణ‌లో 375 కిలోమీట‌ర్ల కు పైగా పాద‌యాత్ర చేస్తారు. ఈ యాత్రలో తెలంగాణ‌లో పూర్తిగా 19 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు 7 పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌వ‌ర్ చేస్తుంది. న‌వంబ‌ర్ 4న యాత్ర‌కు ఒక రోజు విరామం ల‌భించ‌నుంది.

ఇదిలా ఉండ‌గా క్రీడా, వ్యాపార‌, వినోద రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో స‌హా మేధావులు, వివిధ సంఘాల నాయ‌కులతో స‌మావేశం కానున్నారు. ఈ యాత్ర‌లో రాహుల్ గాంధీ దేవాల‌యాలు, మ‌సీదులు, చ‌ర్చీలను సంద‌ర్శిస్తారు. ప్ర‌స్తుతం ఈ యాత్ర‌కు ఎన‌లేని స్పంద‌న ల‌భిస్తుండ‌డం విశేషం.

Also Read : పూన‌మ్ రాహుల్ చెట్టాప‌ట్టాల్

Leave A Reply

Your Email Id will not be published!