Mohammad Azharuddin : విహారి రాణిస్తే బెట‌ర్ లేదంటే క‌ష్టం

50 లేదా 60 ర‌న్స్ స‌రిపోవు

Mohammad Azharuddin : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్, హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ చీఫ్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న తెలుగు క్రికెట‌ర్ హ‌నుమ విహారిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

కేవ‌లం 50 లేదా 60 ర‌న్స్ చేస్తే క‌ష్ట‌మ‌ని సెంచ‌రీలు చేసేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించాడు. లేక‌పోతే రాబోయే రోజుల్లో భార‌త జ‌ట్టు త‌ర‌పున ఆడ‌డం మ‌రింత క‌ష్టంగా మారుతుంద‌న్నాడు.

28 ఏళ్లున్న హ‌నుమ విహారి (Hanuma Vihari) గ‌త మూడున్న‌ర ఏళ్ల‌ల్లో కేవ‌లం 15 టెస్టులు మాత్ర‌మే ఆడాడు. 35.13 స‌గ‌టుతో కేవ‌లం 808 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. క్రీజులో పాతుకు పోవ‌డం.

ఆపై ప‌రుగులు చేయ‌డం అన్న‌ది ముఖ్యం. ప్ర‌స్తుతం ఆడుతున్న ఆట తీరును పూర్తిగా మార్చు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ ప‌డ్డాడు అజ‌హ‌రుద్దీన్.

2018 నుండి భార‌త టెస్టు క్రికెట్ లో భాగ‌మ‌య్యాడు ఈ తెలుగు క్రికెట‌ర్. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన టెస్టులలో ఒక సెంచ‌రీ, 5 హాఫ్ సెంచ‌రీలు మాత్ర‌మే ఉన్నాయి.

మిడిల్ ఆర్డ‌ర్ లో ప‌టిష్ట‌మైన బ్యాట‌ర్ గా పేరొందినా ఆశించిన మేర స్కోర్ చేయ‌లేక పోతున్నాడు. ఇదే విష‌యాన్ని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు మాజీ కెప్టెన్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్(Mohammad Azharuddin).

ఇదిలా ఉండ‌గా భార‌త సెలెక్ట‌ర్లు హ‌నుమ విహారిని జూలై 1 నుంచి 5 వ‌ర‌కు బ‌ర్మింగ్ హోమ్ లో ని ఎడ్డ్ బాస్ట‌న్ లో ఇంగ్లండ్ తో ఐదో రీ షెడ్యూల్ టెస్టు కోసం ప్ర‌క‌టించిన జ‌ట్టులో విహారి ఉన్నాడు.

దీనిపై స్పందించాడు అజ్జూ భాయ్(Mohammad Azharuddin). ఇది మంచి చాన్స్ విహారికి. సెంచ‌రీ చేసేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌న్నాడు.

 

Also Read : భార‌త్ దెబ్బ ఆసిస్ అబ్బా – వ‌సీం జాఫ‌ర్

 

Leave A Reply

Your Email Id will not be published!