Mohan Bhagwat: బంగ్లాదేశ్‌లోని హిందువులకు భరోసా ఇవ్వాలి – ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
బంగ్లాదేశ్‌లోని హిందువులకు భరోసా ఇవ్వాలి - ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
Mohan Bhagwat: పొరుగు దేశం బంగ్లాదేశ్ లో ఇటీవలి నెలకొన్న రాజకీయ అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడి హిందూ సమాజంపై జరుగుతున్న దాడులపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పందించారు. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలు ఎటువంటి కారణం లేకుండానే హింసకు గురవుతున్నారని, వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత భారత దేశంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నాగ్ పుర్ లోని మహల్ ప్రాంతంలో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
Mohan Bhagwat Comment
‘పొరుగు దేశంలో హింస జరుగుతోంది. అక్కడ నివసించే హిందువులు ఎటువంటి కారణం లేకుండా దాడులను ఎదుర్కొంటున్నారు. భారత దేశంలో ఇతరులకు సహాయం చేసే సంప్రదాయం ఉంది. గత కొన్నేళ్లుగా మనం ఎవరిపైనా దాడి చేయలేదు. అస్థిరత, అరాచకాలు ఎదుర్కొంటున్న ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మన దేశంపై ఉంది’ అని పేర్కొన్నారు. మరోవైపు మైనారిటీల రక్షణపై దృష్టి సారించామన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రకటనను అమెరికా స్వాగతించింది. మరోవైపు బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్న దాడులపై… ఎర్రకోటపై జెండా ఎగురవేసిన అనంతరం ప్రధాని మోదీ స్పందించిన సంగతి తెలిసిందే.
Also Read : Farooq Abdullah: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై ఈడీ కేసు కొట్టివేత !