Mohan Bhagwat : భార‌త్ ను విశ్వ గురువుగా చేయాలి

పిలుపునిచ్చిన మోహ‌న్ భ‌గ‌వ‌త్

Mohan Bhagwat : యావ‌త్ ప్ర‌పంచానికి భార‌త్ విశ్వ గురు కావాల‌ని పిలుపునిచ్చారు రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్. విదేశాల‌లో నివ‌సిస్తున్న సంఘ్ కార్య‌క‌ర్త‌లు మ‌రింత కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.

మీ ప్ర‌తిభా పాట‌వాల‌తోనే కాకుండా మీ వ్య‌క్తిత్వంతో ప్ర‌కాశించేలా మిమ్మ‌ల్ని మీరు స‌రిదిద్దు కోవాల‌ని సూచించారు. మ‌నం స‌క్ర‌మంగా, ధ‌ర్మ బ‌ద్దంగా ఉంటేనే ఇత‌రుల‌కు బోధించ‌గ‌ల‌మ‌ని గుర్తుంచు కోవాల‌న్నారు.

అక్క‌డి ప్ర‌జ‌ల‌కు మీరంతా ఆద‌ర్శ ప్రాయంగా మారాల‌న్నారు మోహ‌న్ భ‌గ‌వ‌త్. భార‌తీయులు తాము నివ‌సిస్తున్న విదేశాల‌కు ఆస్తుల‌ని ఆర్ఎస్ఎస్ చీఫ్ స్ప‌ష్టం చేశారు. భార‌త దేశాన్ని సుసంప‌న్నం చేసేందుకు , విశ్వ గురువుగా మార్చేందుకు కృషి చేయాల‌న్నారు.

భోపాల్ లో జ‌రిగిన ఆర్ఎస్ఎస్ విశ్వ సంఘ్ శిక్షా వ‌ర్గ్ (ప్ర‌పంచ శిక్ష‌ణా శిబిరం) ముగింపు స‌మావేశంలో మోహ‌న్ భ‌గ‌వ‌త్ పాల్గొని ప్ర‌సంగించారు. దీనికి ప్ర‌పంచంలోని వివిధ ప్రాంతాల నుండి స‌భ్యులు హాజ‌ర‌య్యారు.

భార‌త్ ను సుసంప‌న్నంగా మార్చేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు. దానిని విశ్వ గురువుగా త‌యార‌య్యేలా చూడాల‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న దేశాల్లో రాణిస్తూ అక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఆద‌ర్శంగా నిల‌వాల‌ని పురుషులు, మ‌హిళా వాలంటీర్ల‌ను కోరారు మోహ‌న్ భ‌గ‌వ‌త్(Mohan Bhagwat).

స్వ‌చ్ఛంధంగా శాంతియుత ప్ర‌పంచాన్ని నిర్మించేందుకు కృషి చేయాల‌న్నారు. యుకెతో స‌హా 15 దేశాల నుండి 60 మంది స్వ‌యం సేవకులు , 13 దేశాల నుండి 31 మంది మ‌హిళా వాలంటీర్లు ఈ శిబిరంలో పాల్గొన్నారు.

1992లో ఇలాంటి స‌మావేశాన్ని నిర్వ‌హించామ‌ని ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్త ఒక‌రు తెలిపారు. విదేశాల్లో ప్త‌రి రెండు మూడు ఏళ్ల‌కు ఒక‌సారి ఇలాంటివి చేప‌డ‌తామ‌న్నారు.

Also Read : స‌హ‌నంతో ఉంటే స‌హించ‌డం కాదు

Leave A Reply

Your Email Id will not be published!