Monkeys: చిన్నారిని నీళ్ల డ్రమ్ములో పడేసిన కోతులు

చిన్నారిని నీళ్ల డ్రమ్ములో పడేసిన కోతులు

Monkeys : ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో జరిగిన షాకింగ్‌ ఘటన ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. ఓ ఇంట్లో దూరిన కోతులు (Monkeys)… మంచంపై నిద్రపోతున్న రెండేళ్ల పసికందును బయటకు లాక్కెళ్లి… ఇంటిపై ఉన్న నీళ్ల డ్రమ్ములో పడేయడంతో ఆ పాప ప్రాణాలు కోల్పోయింది. మఖ్రేహ్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరజ్‌పూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Monkeys Sensational Incident

సీతాపూర్ జిల్లాలో మఖ్రేహ్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరజ్‌పూర్ గ్రామంలో అనుజ్ కుమార్ కుమారుడు కనిపించకుండా పోయాడు. తల్లి సవిత స్నానం చేయడానికి వెళ్ళిన సమయంలో… నిద్రిస్తున్న చిన్నారిని ఇంట్లోకి చొరబడిన కోతులు (Monkeys) ఎత్తుకెళ్లాయి. పసికందు కనిపించడం లేదని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఇంట్లో, చుట్టుపక్కల ప్రాంతంలో గాలించారు. చివరికి నీటి డ్రమ్ములో చిన్నారి మృతదేహన్ని గుర్తించారు.

అయితే, ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే కుటుంబ సభ్యులు గురువారం సాయంత్రం శిశువు అంత్యక్రియలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు… విచారణ చేపట్టారు. శిశువు తండ్రి అనుజ్ కుమార్ ఇంటి బయట ఒక ఎలక్ట్రిక్ షాపును నిర్వహిస్తున్నాడని… ఇప్పటివరకు కుటుంబం నుండి ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు. చిన్నారి మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మూగజీవాలపై ప్రేమతో 166 కుక్కలు పెంచుతున్న దంపతులు

శునకాలపై ఇష్టం ఉన్నవారు… ఒకటి లేక రెండింటిని ఇంట్లో పెంచుకోవడం మనం చూస్తుంటాం. కానీ, వందకుపైగా కుక్కలను పెంచుకుంటున్నారు ఓ జంట. వారే డాగ్‌ కపుల్‌గా గుర్తింపు పొందిన సోమెన్‌, సోనాలి. దాదాపు 25 ఏళ్ల క్రితం సోమెన్‌, సోనాలి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొత్త జీవితం ఆరంభించేందుకు రాంచీకి వెళ్లారు. ఈ క్రమంలో రెండు కుక్కలను వారు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత మరిన్ని కుక్కలకు కూడా ఆశ్రయం కల్పించారు. అలా ప్రస్తుతం రోడ్డుపై వదిలేసిన, ప్రమాదాలకు గురైన, అనారోగ్యం బారిన పడిన 166 కుక్కలకు వీరు సంరక్షణ ఇస్తున్నారు. ఇవన్నీ వారి ఇంట్లోనే ఉంటున్నాయి.

అయితే, 166 కుక్కలకు రోజూ ఆహారం అందించడం, వాటి బాగోగులు చూసుకోవడం పెద్ద సవాలుతో కూడుకున్నది. మొదట వీటన్నింటికీ అయ్యే ఖర్చులన్నీ ఈ జంట తమ సొంత డబ్బును వాడేవారు. క్రమంగా ఆ భారం పెరిగిపోతూ వస్తుండటంతో.. జంతు ప్రేమికులు, సన్నిహితుల వాట్సప్‌, ఫేస్‌బుక్‌ గ్రూప్‌ల ద్వారా విరాళాలు సేకరించడం ప్రారంభించారు. ఇటీవల పలు సంస్థల కూడా ఆర్థిక సాయం అందించాయి. అయితే, శునకాల సంరక్షణ వారికి ఇంకా కష్టతరంగానే ఉంది. వాటి చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చవుతుండటంతో.. మరింత ఆర్థిక సాయం కావాలని కోరుతున్నారు.

Also Read : Nirmala Sitharaman: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూనే ఉంటాం – నిర్మలా సీతారామన్‌

Leave A Reply

Your Email Id will not be published!