Lay Offs Effect : ఉన్న ఉద్యోగాలకు కంపెనీలు ఎసరు
తొలగించేందుకు పోటీ పడుతున్నాయి
Lay Offs Effect : ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. టెక్, ఫార్మా, ఇకామర్స్ , లాజిస్టిక్, తదితర రంగాలలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఆయా కంపెనీలు కొత్త ఉద్యోగాల భర్తీకి చెక్ పెట్టాయి. ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెట్టాయి.
ఇప్పటికే ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్న కొత్త బాస్ ఎలాన్ మస్క్ వచ్చీ రావడంతోనే 12 వేల మందికి పైగా తొలగించాడు. ఇందులో పర్మినెంట్, కాంట్రాక్టు ఎంప్లాయిస్ ఉన్నారు. ఇక ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుకర్ బర్గ్ 11,000 మందిని తొలగించాడు. మైక్రో సాఫ్ట్ , అమెజాన్ 10,000 మందిని తొలగించింది.
ఆ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్ బేజోస్ అయితే వస్తువులు కొనకండి పొదుపు చేయడం నేర్చుకోండి అంటూ పిలుపునిచ్చాడు. ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని తెలియ చేస్తోంది. ఇదంతా కాస్ట్ కటింగ్ లో ఓ భాగం అంటున్నాయి కంపెనీలు.
ఉన్న ఉద్యోగాలు తొలగించుకుంటూ(Lay Offs Effect) పోతే ఇక కొత్త వాటిని భర్తీ చేయడం అన్నది ఇప్పట్లో ఉండక పోవచ్చని అంచనా. ప్రధానంగా మిగతా రంగాల కంటే టెక్ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఉంటారో ఉండరోనన్న ఆందోళన నెలకొంది.
మరో వైపు 2025 నాటికి 6 వేల మందిని తొలగిస్తామని హెచ్ పీ సంస్థ ప్రకటించింది. ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కేందుకు కంపెనీలు ఇతర ఖర్చులను తగ్గిస్తున్నాయి.
బోనస్ లు, ఇతర ప్రయోజనాలు, సౌకర్యాలకు చెక్ పెట్టాయి. ఇదిలా ఉంటే మరో వైపు కొంచెం ఆశాజనకంగా కనిపిస్తూ వచ్చిన మీడియా, వినోదం రంగాల్లోనూ తొలగింపు ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ఈ రంగంలో 6 వేల మందికి పైగా తొలగించాయి. రాబోయే రోజుల్లో మరింతగా ఉండే అవకాశం లేక పోలేదు.
Also Read : ఖర్చు చేస్తే ప్రమాదం దాచుకుంటే లాభం