Covid19 Updates : ఒక్క రోజే 4 వేలకు పైగా కరోనా కేసులు
వైరస్ దెబ్బకు 15 మంది మృతి
Covid19 Updates : కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినా మళ్లీ మెల మెల్లగా కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ప్రభావితం చూపిస్తూనే ఉంది కరోనా. కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది.
అయినా కరోనా కేసులు ఆశించిన మేర తగ్గడం లేదు. తాజాగా కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ కరోనా కేసుల గురించి వెల్లడించింది.
గత 24 గంటల్లో ఏకంగా 4,000లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా(Covid19 Updates) ఎఫెక్ట్ తో 15 వైరస్ మరణాలు సంభవించాయి.
ఇక మొత్తం ఇన్ ఫెక్షన్లలో యాక్టివ్ కేసులు 0.11 శాతం ఉండగా జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.71 శాతానికి పెరిగిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజాగా అందిన సమాచారం మేరకు కొత్తగా నమోదైన కేసుల పరంగా చూస్తే 4,043 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 4,45,43,089కి చేరుకుంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం యాక్టివ్ కేసులు 47,379కి తగ్గాయి. గడిచిన 24 గంటల్లో మృతి చెందిన వారి సంఖ్య 15 ఉండగా మొత్తం మరణాల సంఖ్య దేశంలో ఇప్పటి వరకు 5,28,370కి చేరిందని వెల్లడించింది.
648 కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇక రోజు వారీ పాజిటివిటీ రేటు 1.37 శాతంగా నమోదైంది. వారానికి అనుకూలత రేటు 1.81 శాతంగా నమోదైంది.
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ వేసుకోవాలని కోరింది. అన్ని ప్రభుత్వ కేంద్రాలలో ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. మందులు కూడా ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించింది కేంద్రం.
Also Read : 25 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్