Derek O Brien Modi : పీఎంపై ఎంపీ ట్వీట్ తొలగించిన ట్విట్టర్
ఆరోపించిన టీఎంసీ ఎంపీ ఓబ్రియన్
Derek O Brien Modi : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరిక్ ఓబ్రియన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన శనివారం కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, ట్విట్టర్ పై నిప్పులు చెరిగారు. ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలియడం లేదని పేర్కొన్నారు. ఇదే ట్విట్టర్ వేదికగా సీరియస్ కామెంట్స్ చేశారు.
ఇటీవల ప్రధానమంత్రి మోదీని ప్రశ్నిస్తూ ప్రముఖ అంతర్జాతీయ మీడియా బీబీసీ ఓ డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. అది ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ సీరియస్ గా స్పందించింది.
ఇది పూర్తిగా వ్యక్తిగతంగా దెబ్బ తీసేలా ఉందంటూ పేర్కొంది. మరో వైపు బీబీసీ డాక్యుమెంటరీ వల్ల దేశంలోని ప్రజల మధ్య మరోసారి చిచ్చు పెట్టేలా ఉందంటూ ప్రముఖ న్యాయవాది ఆదిత్యా జిందాల్ బీబీసీపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దావా కూడా వేశారు. ఇదిలా ఉండగా మోదీ డాక్యుమెంటరీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీఎంసీ ఎంపీ డెరిక్ ఓబ్రియన్(Derek O Brien).
వాస్తవాలను తెలియ చేస్తే తట్టుకోలేని స్థితికి దిగజారి పోయారంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అంతే కాదు తాను పీఎంకు వ్యతిరేకంగా పెట్టిన పోస్ట్ ను ట్విట్టర్ తొలగించిందని ఆరోపించారు. దీని వెనుక మోదీ ప్రమేయం ఉందంటూ మండిపడ్డారు. ఇక దేశంలో ప్రజాస్వామ్యం అన్నది ఉందా అని ప్రశ్నించారు టీఎంసీ ఎంపీ.
Also Read : మోడీ ప్రచారం తప్పా అభివృద్ది ఏది