DV Sadananda Gowda : బీఎల్ సంతోష్ పై సదానంద ఫైర్
2024 ఎన్నికల్లో టికెట్ రాదని కన్ ఫర్మ్
DV Sadananda Gowda : కర్ణాటకలోని భారతీయ జనతా పార్టీలో లుకలుకలు బయట పడుతున్నాయి. అంతా తానై చక్రం తిప్పుతున్న పార్టీకి చెందిస సీనియర్ నాయకుడు బీఎల్ సంతోష్ పై నిప్పులు చెరిగారు ఎంపీ సదానంద గౌడ(Sadananda Gowda). ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదేమి అన్యాయమని ప్రశ్నించారు. రాష్ట్రంలో పార్టీని తన అనాలోచిత చర్యల వల్ల భ్రష్టు పట్టిస్తున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా 2024లో తనకు టికెట్ రాదని కన్ ఫర్మ్ అయ్యారు ప్రస్తుత ఎంపీ సదానంద గౌడ. దీంతో దీనికంతటికీ కారణం బీఎల్ సంతోష్ అని ఆరోపించారు.
ఇప్పటికే పార్టీ పవర్ లోకి రాకుండా ఉండేందుకు బీఎల్ సంతోష్ ప్రయత్నం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా తమ పార్టీ క్రమశిక్షణకు మారు పేరు అంటూ బాకాలు ఊదే కాషాయ పార్టీలో కలకలం రేపుతున్నాయి తాజా ఎంపీ సదానంద గౌడ చేసిన వ్యాఖ్యలు. బీజేపీని నామ రూపాలు లేకుండా చేసేందుకు బీఎల్ సంతోష్ లోపాయికారీగా కుట్ర పన్నుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ గౌడ.
ఇదిలా ఉండగా తాజాగా కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 65 సీట్లతోనే సరి పెట్టుకుంది. సీనియర్లను కాదని జూనియర్లకు ఇవ్వడం మైనస్ పాయింట్ . ఇక కాంగ్రెస్ పార్టీ 135 సీట్లతో ఏకైక పార్టీగా అవతరించింది. నలుగురు ఇండిపెండెంట్లు గెలిస్తే చక్రం తిప్పాలని అనుకున్న జేడీఎస్ కేవలం 19 సీట్లకే పరిమితమైంది.
Also Read : Anurag Thakur Invite : అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్ల భేటీ