MP Laxman : హైదరాబాద్ – బీజేపీ రాజ్యసభ సభ్యుడు, మాజీ బీజేపీ స్టేట్ చీఫ్ లక్ష్మణ్ సీరియస్ కామెంట్స్ చేశారు. కేంద్ర జల శాఖ ఆధ్వర్యంలోని డ్యామ్ సేఫ్టీ సంచలన నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రిపోర్ట్ కలకలం రేపింది. పూర్తిగా ఎలాంటి డిజైన్ లేకుండా నిర్మించారని, నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆరోపించారు లక్ష్మణ్.
MP Laxman Comments About Kaleshwaram Project
కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ మీడియాతో మట్లాడారు. బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తోందని, దీనికి ప్రధాన కారకుడు సీఎం కేసీఆర్ అని ఆరోపించారు. మేడిగడ్డ కుంగి పోయిందని, అన్నారం బ్యారేజ్ లో బుంగ పడిందని, రేపొద్దున సుందిళ్ల కూడా కుంగి పోయే ప్రమాదం ఉందంటూ డ్యామ్ సేఫ్టీ నివేదిక వెల్లడించిందని ఇకనైనా జాగ్రత్త పడాలని సూచించారు లక్ష్మణ్(MP Laxman).
ఇందులో ఎవరెవరి పాత్ర ఉందో తేలాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఇన్నేళ్ల పాటు కేవలం ఫామ్ హౌస్ కే పరిమితమైన సీఎం ఎలా దోచుకోవాలనే దానిపై ఫోకస్ పెట్టారంటూ ధ్వజమెత్తారు.
నాలుగున్నర కోట్ల ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన బీఆర్ఎస్ కు త్వరలో జరిగే ఎన్నికల్లో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు.
Also Read : C Narayana Reddy: సినారె