MP Magunta Sreenivasulu Reddy: వైసీపీకు ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా !
వైసీపీకు ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా !
MP Magunta Sreenivasulu Reddy: ఏపీలో అధికార వైసీపీకు భారీ షాక్ తగిలింది. వైనాట్ 175 అంటూ ఎన్నికలకు ఒకవైపు వైసీపీ అధిష్టానం సిద్ధమౌతుండగా… మరోవైపు సుమారు 49 నెలలు అధికారం అనుభవించిన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీను వీడి షాకిస్తున్నారు. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి… వైసీపీకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఒంగోలులో నిర్వహించిన మీడియా సమావేశం నిర్వహించి తన రాజీనామాకు గల కారణాలను వివరించారు.
MP Magunta Sreenivasulu Reddy Resign from YCP
ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ… ‘‘ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్. 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా… 11 సార్లు చట్టసభలకు పోటీ చేశా. మా కుటుంబానికి అహం లేదు… ఉన్నదల్లా ఆత్మగౌరవమే. కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైసీపీను వీడుతున్నాను. బాధాకరమే అయినా తప్పడం లేదు. ఒంగోలు ఎంపీ బరిలో నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించాం’’ అని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. మాగుంట రాజీనామా అధికార వైసీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత కొంతకాలంగా మాగుంట రాజీనామాపై పుకార్లు వస్తున్నాయి. అయితే అధిష్టానం వాటిని పరిష్కరించిందని అంతా భావించారు. అయితే ఎంపీ మాగుంట(MP Magunta Sreenivasulu Reddy) అనూహ్యంగా పార్టీకు రాజీనామా చేసారు.
మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాజీనామాతో… వైసీపీను వీడిన ఎంపీల సంఖ్య ఆరుకు చేరింది. వైసీపీను వీడిన వారిలో ఐదుగురు లోక్ సభ ఎంపీలు, ఒక రాజ్యసభ ఎంపీ ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పారు.
Also Read : DMK Advertisement: ప్రభుత్వ ప్రకటనలో చైనా జెండా ! డిఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం !