MP Mahua Moitra: అమిత్ షా తల నరికి టేబుల్‌పై పెట్టాలి – ఎంపీ మహువా సంచలన వ్యాఖ్యలు
అమిత్ షా తల నరికి టేబుల్‌పై పెట్టాలి - ఎంపీ మహువా సంచలన వ్యాఖ్యలు
Mahua Moitra : కేంద్రహోంమంత్రి అమిత్‌షాపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. లక్షలాది మంది భారత్‌లో చొరబడుతున్నారు. మన భూమిని ఆక్రమించుకుంటున్నారు. భారత సరిహద్దులు రక్షించలేకపోతే, మహిళల గౌరవం దెబ్బతింటే, కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) బాధ్యత వహించాల్సిందే. అందుకు అమిత్ షా తల నరికించి టేబుల్‌పై పెట్టాలి’ అని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తాజాగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లోకి బంగ్లా అక్రమ వలసదారుల ప్రవేశం గురించి మీడియా ప్రశ్నించినప్పుడు మహువా మెయిత్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
MP Mahua Moitra Slams Amit Shah
‘భారతదేశ సరిహద్దులకు రక్షణ లేకపోతే వందలాది మంది చొరబాటుదారులు లోపలకు అడుగుపెట్టి మన మహిళలను అగౌరవపరుస్తూ మన భూములు లాక్కుంటుంటే మనం అమిత్‌షా (Amit Shah) తల నరికి టేబుల్ పై పెట్టాలి. అది మన బాధ్యత’ అని మహువా మొయిత్రా అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చొరబాటుదారుల వల్ల జనాభాలో మార్పులు వస్తున్నాయని చెప్పారని, అప్పుడు ముందు వరుసలో ఉన్న హోం మంత్రి నవ్వుతూ, చప్పట్లు చరిచారని ఆమె అన్నారు. సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్ ఉన్నప్పటికీ చొరబాట్లు ఎలా కొనసాగుతున్నాయని ఆమె ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో అక్రమ వలసలకు కేంద్ర నాయకత్వమే కారణమంటూ విమర్శలు గుప్పించారు.
విద్వేష ప్రసంగం – బీజేపీ
కేంద్ర మంత్రి అమిత్ షాపై మహువా మొయిత్రా (Mahua Moitra) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది. విద్వేషంతో విషం చిమ్మేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ నేత ప్రదీప్ భండారి మండిపడ్డారు. ఆమె వ్యాఖ్యలు ఏమాత్రం హుందాగా లేవన్నారు. మమతా బెనర్జీ టీఎంసీ నిర్దేశకత్వంలో ఆమె ఇంత దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. కాగా, మహువా మొయిత్రా వ్యాఖ్యలపై సందీప్ మజుందార్ అనే స్థానికుడు కృష్ణానగర్ కొత్వాల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిహార్‌లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రలో కొందరు ప్రధాని మోదీ, మోదీ తల్లి హీరాబెన్‌ని దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ కూడా చేశారు. ఈ పరిణామంపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. నరేంద్రమోదీని, మోదీ తల్లిని దూషించిన ఘటనను అమిత్ షా తీవ్రంగా ఖండించారు. శుక్రవారం అసోం గువాహటి రాజ్‌భవన్‌లో బ్రహ్మపుత్రా వింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో షా మాట్లాడుతూ.. ‘‘రాహుల్ గాంధీకి ఏమాత్రం సిగ్గున్నా.. మోదీకి, ప్రాణాలతో లేని ఆయన తల్లికి, ఈ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని క్షమాపణలు చెప్పాలి’’అని డిమాండ్ చేశారు.
‘‘రెండు రోజుల కిందట జరిగిన ఘటన..ప్రతీ ఒక్కరినీ బాధించింది. మోదీ తల్లి ఒక పేద కుటుంబంలో విలువలతో బిడ్డలను పెంచింది. అలాంటి తల్లి జీవితాన్ని అవమానించడాన్ని భారతీయలెవరూ సహించలేరు. రాజకీయ జీవితంలో ఇంతకన్నా దిగజారుడు తనం ఇంకొటి లేదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. రాహుల్ గాంధీకి ఏ కొంచెం సిగ్గు మిగిలి ఉన్నా క్షమాపణలు చెప్పాలి’’ అని అమిత్ షా డిమాండ్ చేశారు. బీహార్‌లో తన యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ రాజకీయాలు అట్టడుగుస్థాయికి చేరాయి. ప్రతి కాంగ్రెస్ నాయకుడు మోదీపై అవమానకరమైన పదాలు ఉపయోగిస్తున్నారు. రాజకీయాల్లో ద్వేష సంస్కృతిని వ్యాప్తి చేస్తోంది కాంగ్రెస్సే. కాంగ్రెస్ ఎంత ఎక్కువ దూషణలు చేస్తే.. బీజేపీ అంత మంచిది.. అంత ఎక్కువగా గెలుస్తుంది కూడా’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
Also Read : TVK Party: సుప్రీంకోర్టుకు నటుడు విజయ్ టీవీకే పార్టీ
