MP Mithun Reddy: బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మిథున్‌రెడ్డి
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మిథున్‌రెడ్డి
MP Mithun Reddy : ఏపీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి గురువారం ఏసిబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్నారు మిథున్‌రెడ్డి (MP Mithun Reddy)… ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఆయన ఉన్నారు. కాగా, లిక్కర్ స్కాం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లని వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. ఈ కేసులో ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్‌రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
MP Mithun Reddy Liquor Scam Case
మద్యం ముడుపుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. శ్రావణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు పంపించారు ఈడీ (ED) అధికారులు. PMLA చట్టం కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ నెల 28వ తేదీ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆంధ్రా గోల్డ్ బ్రాండ్ పేరిట భారీగా మద్యం తయారీ చేసినట్లు గుర్తించారు.
ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఆంధ్రా గోల్డ్ బ్రాండ్ భారీగా కొనుగోళ్లు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. ఇప్పటికే సిట్, ఈడీ అధికారులు మద్యం కేసుకు సంబంధించి పూర్తి సమాచారం సేకరించారు. ఇక వరుసగా దర్యాప్తు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే సిట్ ప్రిలిమినరీ చార్జిషీట్ వేయడంతో ఇక దర్యాప్తు ప్రారంభించాలని ఈడీ (ED) అధికారులు తుది నిర్ణయం తీసుకున్నారు.
సిట్ అధికారుల ఎదుట ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్‌రావు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం విజయవాడలోని సిట్ ఆఫీస్‌కు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్‌రావు విచారణకు హాజరయ్యారు. లిక్కర్ స్కామ్ (Liquor Scam) కేసులో నిందితులకు దుబాయ్ లో శ్రవణ్‌రావు ఆశ్రయం ఇచ్చాడని అధికారుల విచారణలో తేలడంతో నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన సిట్ ఆఫీసుకి వచ్చారు. అయితే మూడు గంటలుగా శ్రవణ్‌రావుని సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. దుబాయ్‌లో లిక్కర్ స్కామ్ నిందితులకు రెండు నెలల పాటు శ్రవణ్‌రావు ఫ్లాట్‌లో ఉన్నట్లు గుర్తించారు సిట్ అధికారులు. ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ నిందితులకు ఆశ్రయం ఇవ్వడంపై శ్రవణ్‌రావుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సిట్ అధికారుల విచారణలో శ్రవణ్‌రావు నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు యత్నిస్తున్నారు.
లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితులకు దుబాయ్‌లో శ్రవణ్‌రావు ఆశ్రయం కల్పించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. కిరణ్ కుమార్‌రెడ్డి, సైఫ్, అహ్మద్, వరుణ్ కుమార్, శివకుమార్, సైమన్, ప్రసన్, ప్రద్యుమ్నా, అవినాష్ రెడ్డి, అనిరుద్‌రెడ్డిలు ఎలా పరిచయం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. ఓ స్నేహితుడి ద్వారా పరిచయమని తెలిపారు శ్రవణ్‌రావు. ఆశ్రయం ఎందుకు కల్పించారని శ్రవణ్‌రావుని ప్రశ్నించారు సిట్ అధికారులు.
అయితే ఈ విషయంలో మౌనంగా ఉండిపోయారు శ్రవణ్‌రావు. లిక్కర్ కేసులో వాళ్లు నిందితులు తెలుసా అంటూ శ్రవణ్‌రావుని నిలదీశారు. అయితే ఈ విషయం తనకు తెలియదని శ్రవణ్‌రావు బదులు ఇచ్చాడు. ఈ కేసులో కీలక నిందితులని తెలిసినా ఆశ్రయం ఇచ్చారా అంటూ మరోసారి ప్రశ్నించారు సిట్ అధికారులు. ఎవరి కోసం, ఎందుకోసం ఈ ఆశ్రయం కల్పించారని ప్రశ్నల వర్షం కురిపించారు. సిట్ ప్రశ్నలకు శ్రవణ్‌రావు సమాధానాలు దాటవేసే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
అయితే, శ్రవణ్‌రావు సిట్ విచారణలో ట్విస్ట్ నెలకొంది. శ్రవణ్‌రావు సాక్షి మాత్రమేనా?నిందితుడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితులకు దుబాయ్‌లో ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం కల్పించాడా? ఉద్దేశపూర్వకంగా కల్పిస్తే ఈ కేసులో నిందితుడిగా చేరుస్తారా? అనే సందేహాలు వస్తున్నాయి. లిక్కర్ స్కాం నిందితులకు శ్రవణ్‌రావు ఎందుకు ఆశ్రయం కల్పించారు. ఎవరి మెప్పుకోసం నిందితులకు ఆశ్రయం కల్పించారని ప్రశ్నించారు సిట్ అధికారులు.
తనకు ఏమి తెలియదు…లిక్కర్ స్కాం (Liquor Scam) కేసులో నిందితులని తెలియదని సిట్ ముందు శ్రవణ్‌రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ కేసు నుంచి శ్రవణ్‌రావు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా..? ఫైనల్‌గా సిట్ అధికారులు ఏమి నిర్ధారిస్తారు. శ్రవణ్‌రావు లిక్కర్ స్కాం కేసులో సాక్షినా?….నిందితుడా?. ఇప్పటికే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా శ్రవణ్‌రావు ఉన్న విషయం తెలిసిందే.
Also Read : YS Sharmila : మద్యం స్కామ్ వెనుక ఉన్న కుట్ర కోణాలు వెలికి తీయాలి – వైఎస్ షర్మిల
