MP Mithun Reddy: లిక్కర్ కేసులో మిథున్‌రెడ్డితో పాటు నలుగురికి బెయిల్
లిక్కర్ కేసులో మిథున్‌రెడ్డితో పాటు నలుగురికి బెయిల్
MP Mithun Reddy : ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో (MP Mithun Reddy) పాటు… ఏ31-ధనుంజయ రెడ్డి, ఏ32-కృష్ణ మోహన్ రెడ్డి, ఏ-33 బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు ఎంపీ మిథున్ రెడ్డికి (MP Mithun Reddy) అనుమతిస్తూ ఏసీబీ కోర్టు శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తిరిగి 11వ తేదీన సరెండర్ కావాలని ఆయన్ని కోర్టు ఆదేశించింది. అక్రమ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఎంపీ మిథున్‌రెడ్డి పేరును ఏ4గా చేర్చింది.
MP Mithun Reddy Gets Bail
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం కుంభకోణంలో కేసులో నిందితులుగా ఉన్న ఏ31-ధనుంజయ రెడ్డి, ఏ32-కృష్ణ మోహన్ రెడ్డి, ఏ-33 బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ముగ్గురు నిందితులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనలు ముగిసినట్లు తెలిపింది. ఈ మేరకు ఇవాళ(శనివారం) ముగ్గురికీ బెయిల్ మంజూరు చేస్తూ.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు మే 14న బాలాజీ గోవిందప్ప, మే 17న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ముగ్గురు బెయిల్ కోసం… ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు (ACB Court) విచారణ చేపట్టింది. ఈ మేరకు ఇవాళ(శనివారం) బెయిల్ మంజూరు చేస్తూ… ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే… ముగ్గురు పాస్‌పోర్ట్‌లు అధికారులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఒక్కొక్కరు లక్ష చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని తెలిపింది.
జగన్ ప్రభుత్వం హయాంలో మద్యం విక్రయాల లావాదేవిలన్ని నేరుగా జరిగాయి. అంటే ఎక్కడ డిజిటల్ చెల్లింపులు అనేవి జరగలేదు. దీంతో ఈ ప్రభుత్వంలో జే బ్రాండ్ మద్యం విక్రయాలకు తెర తీశారు. ఈ మద్యం తాగడం వల్ల అనేక మంది మృత్యువాత పడ్డారు. అలాగే పలువురు అనారోగ్యానికి గురయ్యారు. అంతేకాకుండా… ఈ మద్యం విక్రయాల్లో భారీగా అవినీతి చోటు చేసుకుందంటూ ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం మద్యం కుంభకోణంపై సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డిను సిట్ అధికారులు అరెస్ట్ చేసి… విచారించారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డితోపాటు బాలాజీ గోవిందప్పలను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మే 16న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను సిట్ అరెస్ట్ చేయగా 113 రోజులుగా జైల్లో ఉన్నారు.
ఈ సందర్భంగా వైసీపీ (YSRCP) లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘‘లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం సిట్ చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వాంగ్మూలాలతో కేసు నడిపించాలని చూస్తున్నారు. అరెస్టు అయినవారెవరి మీదా సిట్ సాక్ష్యాలు చూపించలేక పోయింది. కేవలం భేతాళ కథలతోనే ఇప్పటిదాకా కేసును నడిపారు. లేని లిక్కర్ స్కాంని ఉన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు’’ అని మనోహర్‌రెడ్డి అన్నారు. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డిలకు ఈ రోజు బెయిల్ వచ్చింది. సహ నిందితుల వాంగ్మూలాలతోనే అరెస్టులు జరుగుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం. సిట్ దర్యాప్తు అంతా బెదిరింపులతోనే సాగుతోంది. తాజాగా సజ్జల భార్గవ, అనిల్‌రెడ్డిల పేర్లను కూడా ఇరికించే ప్రయత్నం సిట్ చేస్తోంది. అసలు బ్యాంకు ఖాతాలు కూడా లేని భార్గవ మనీరూటింగ్ ఎలా చేస్తారు?. సిట్ చెప్పే భేతాల కథలు ఏవీ కోర్టు ముందు నిలపడవు’’ అని మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు.
Also Read : Hydra: హైడ్రా పేరుతో దందాలు చేస్తున్న నిందితుల అరెస్ట్ !
