MP Ramasahayam : ‘సీతారామ’ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వి తప్పుడు వ్యాఖ్యలు

సీనియర్‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టారని అన్నారు...

MP Ramasahayam : ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన సీతారామ ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ నాయకులు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి(MP Ramasahayam) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు కూసుమంచిలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చిన సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం 20శాతం మాత్రమే పనులు చేసిందని, బీఆర్‌ఎస్‌ హాయాంలోనే 80శాతం పనులు అయినట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 19వేల కోట్లలో బీఆర్‌ఎస్‌ రూ.7వేల కోట్లు ఖర్చుచేసిందని, 40శాతం పనులు మాత్రమే చేసిందని తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మూడునెలల కాలంలో 500కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. రెండేళ్లలో మొత్తం ప్రాజెక్టుల పూర్తిచేసి నీళ్లు అందించనున్నట్లు తెలిపారు.

MP Ramasahayam Comment

సీనియర్‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టారని అన్నారు. తుమ్మలపైనా కూడా కామెంట్‌ చేశారని అన్నారు. రైతు రుణమాఫీ హామీని నిలబెట్టుకుంటున్నట్లు ఎంపీ తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడునెలల్లో అన్ని గ్యారంటీలను అమలు చేసిన ఘనత ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేకపోయారని అన్నారు. పక్కా ఇళ్లు కానీ, రుణమాఫీ కానీ చేయలేకపోయరని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులు తమను పనిచేయనియ్యాలని, మంచి చేస్తే చేయనియ్యాలని అడ్డుకోవడం తగదని హితవు పలికారు. అధికారం నుంచి దించి ఇంట్లో కూర్చోబెట్టినా బుద్దిరావడం లేదని విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కూసుమంచి క్యాంపుకార్యాలయంలో జాతీయపతాకాన్ని ఎంపీ రఘురాంరెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Also Read : ISRO SSLV-D3 : ఇస్రో ఎస్ఎస్ఎల్వీ డీ-3 ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు

Leave A Reply

Your Email Id will not be published!