MP Sanjeev Kumar: వైసీపీకు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గుడ్‌బై
వైసీపీకు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గుడ్‌బై
MP Sanjeev Kumar: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అధికార వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకు షాకుల మీద షాక్ లు తగులుతున్నాయి. తాజాగా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్… తన ఎంపీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు. ఇటీవల కర్నూలు పార్లమెంట్ ఇన్ చార్జి పదవి నుండి సంజీవ్ కుమార్ ను అధిష్టానం తప్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బుదవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ సంజీవ్ తెలిపారు.
MP Sanjeev Kumar Resignation
విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ సంజీవ్(MP Sanjeev Kumar) మాట్లాడుతూ… ‘‘వైద్యుడిగా ఉన్న నేను ప్రజలకు సేవ చేద్దామని వచ్చా. నేను వందశాతం లక్ష్యంలో పదిశాతమే సాధించా. ఎన్ని ప్రయత్నాలు చేసినా నియోజకవర్గం అభివృద్ధి చేయలేకపోయా. పెద్దలను కలసి రాజీనామా చేయాలని భావించా. నా రాజీనామాకు ప్రధాన కారణం అభివృద్ది లేకపోవడమే. కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలనేది నా లక్ష్యం. కర్నూలు నుంచి బళ్లారి వరకు జాతీయ రహదారి సాధించాలి. నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేశా.
వలసలు ఆగాలంటే పెద్దస్థాయిలో నిర్ణయాలు జరగాలి. నియోజకవర్గంలో సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్ళడానికి అపాయింట్‌మెంట్ అడిగితే ఎందుకు ఎక్కువ కష్టపడతావు అని నన్ను చులకన చేసిన మాట్లాడారు. ఐదేళ్లలో కేవలం 3 సార్లు మాత్రమే సీఎంను కలిసేందుకు అవకాశం ఇచ్చారు. నీవు ఎందుకు కష్టపడతావు… ఎమ్మెల్యేలు చూసుకుంటారని సీఎం నాకు సలహా ఇచ్చారు. అభివృద్ధి అంతా ఎమ్మెల్యేలు చూసుకుంటారని సీఎం చెప్పారు. ఎంపీగా అభివృద్ధి కోసం నేను ఎంతో ప్రయత్నం చేశా.. ప్రయోజనం దక్కలేదంటూ ఎంపీ సంజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు పెద్దపీట వేస్తామంటారు కానీ… అది చేతల్లో ఉండదన్నారు. ఐదేళ్లలో అభివృద్ధి పనులు చేయలేకపోయానని అందుకే నా ఎంపీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని… నా సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. మరో 20 ఏళ్లు ప్రజా జీవితంలో ఉంటా’’ అని ఆయన వివరించారు.
Also Read : MP Kesineni Nani: త్వరలో వైసిపి కండువా కప్పుకోనున్న కేశినేని నాని !