Tejasvi Surya : ‘హెడ్గే వార్’ తొలగింపుపై ‘సూర్య’ ఫైర్
కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం బీజేపీ ఆగ్రహం
Tejasvi Surya : కర్ణాటకలో రాజకీయ ఆధిపత్యం మళ్లీ మొదలైంది. గతంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొలువు తీరిన సమయంలో విద్యార్థులు చదువుకునే పాఠ్యాంశాలలో బీజేపీకి చెందిన మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హేగ్డే వార్ కు సంబంధించి ఓ అధ్యాయాన్ని చేర్చింది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు ఆందోళన కూడా చేపట్టింది. దేశ స్వాతంత్ర పోరాట కాలంలో ఎక్కడా పాల్గొనలేదని, పైగా వ్యతిరేకంగా వ్యవహరించిన హేడ్గే వార్ గురించి అనవసరమని , తాము పవర్ లోకి వస్తే తీసి వేస్తామంటూ ప్రకటించింది.
అన్న మాట ప్రకారం సీన్ మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ పవర్ లోకి వచ్చింది. వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. విద్యార్థులు చదువుకునే పాఠ్యాంశాల నుంచి హెడ్గే వార్ అధ్యాయాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని శుక్రవారం ఎమ్మెల్సీ వెల్లడించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య(Tejasvi Surya). ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణి తప్ప మరొకటి కాదన్నారు.
హెడ్గే వార్ స్వేచ్ఛ కోసం పోరాడారని , పూర్ణ స్వరాజ్ ను డిమాండ్ చేశారని గుర్తు చేశారు ఎంపీ. ఆనాడు నెహ్రూ జిన్నాకు లొంగి పోయారని , విభజనను వ్యతిరేకించిన చరిత్ర ఆర్ఎస్ఎస్ చీఫ్ దని తెలిపారు. చైనాను బుజ్జగించ బోతే నెహ్రూను హెచ్చరించారని అది చరిత్రలో నిలిచి పోయిందన్నారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించింది, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం పోరాడింది కూడా తామేనన్నారు తేజస్వి సూర్య.
Also Read : IND vs AUS WTC Final : గట్టెక్కించిన రహానే..ఠాకూర్